టాలీవుడ్‌ డైరెక్టర్‌ రాఘవేంద్రరావుకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు

10 Nov, 2023 13:59 IST|Sakshi

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ షేక్‌పేట పరిధిలో రెండెకరాల భూకేటాయింపుపై సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, కె. కృష్ణమోహన్‌లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనకు ప్రభుత్వం కేటాయించిన బంజారాహిల్స్‌లోని రెండెకరాల భూమిని రద్దు చేయాలని మెదక్‌కు చెందిన బాలకిషన్‌ గతంలో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ మేరకు తాజాగా రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం రాయితీ ధరతో  ప్రభుత్వం భూమి కేటాయిస్తే.. వారు దాన్ని షరతులకు విరుద్ధంగా వాడుతున్నారని ఆయన పిల్ దాఖలు చేశాడు.

ఆ భూమిలో పబ్‌లు, థియేటర్లు తదితర వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారని పిల్‌లో బాల కిషన్‌ పేర్కొన్నాడు. దీనిపై విచారించిన హైకోర్టు రాఘవేంద్రర్ రావుతో పాటు కృష్ణ మోహన్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌ల డివిజన్‌‌ బెంచ్‌‌ విచారించింది.

మరిన్ని వార్తలు