ఇస్లామిక్ కళాశాల ఏర్పాటుపై ఆగ్రహం

29 Dec, 2013 03:26 IST|Sakshi
 భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ : తిరుపతిలో అంతర్జాతీయ ఇస్లామిక్ కళాశాలను ఏర్పాటు చేయడంపై ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని నిరసిస్తూ స్థానిక ప్రకాశంచౌక్‌లో గురువారం రాస్తారోకో నిర్వహించాయి. ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు గంటా కృష్ణహరి, వీహెచ్‌పీ నాయకులు వబిలిశెట్టి శ్రీవెంకటేశ్వర్లు, భజరంగ్‌దళ్ నాయకులు వేణుగోలపారాజు మాట్లాడుతూ హిందువుల పుణ్య స్థలమైన తిరుపతిలో అక్రమంగా ఇస్లామిక్ కళాశాలను నిర్మిస్తే అధికారులు, ప్రజాప్రతినిధు లు, టీటీడీ ట్రస్టు బోర్డు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. 
 
 దేశంలో అనేక ప్రాంతాలు ఉండగా తిరుపతిలోనే కళాశాలను ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. దీనిపై విచారణ చేసి కళాశాలను వెంటనే కూల్చివేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే  పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ధర్మ రక్షా వేదిక పట్టణ అధ్యక్షుడు పులఖండం కోటేశ్వరరావు, ధర్మ ప్రచార పరిషత్ జిల్లా అధ్యక్షుడు తోరం సూర్యనారాయణ, బీజేపీ పట్ణణ అధ్యక్షుడు అరసవల్లి సుబ్రహ్మణ్యం, కేవీ రమేష్, వానపల్లి సూర్యప్రకాశరావు, పి.లక్ష్మణవర్మ, కఠారి వెంకటేశ్వరరావు, కొమ్ము శ్రీనివాస్, బి.శ్రీనివాస్, జి.కృష్ణవేణి, గన్నపురెడ్డి గోపాలకృష్ణ పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు