'నాలుగురోజులైనా నిందితులను పట్టుకోలేదు'

1 Jan, 2015 18:25 IST|Sakshi

హైదరాబాద్: తుళ్లూరు మండలంలోని రైతుల ఆస్తుల విధ్వంసాన్ని ప్రతిపక్షాలు చేయించాయనడం సరికాదని జన చైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు వి.లక్ష్మణ్రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రాజధాని భూముల్లో విధ్వంసం జరిగి నాలుగురోజులైనా ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేదని అన్నారు. రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని.... అలాగే నిందితులను కఠినంగా శిక్షించాలని లక్ష్మణ్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కృష్ణా నది పరివాహక ప్రాంతంలో రాజధానిని నిర్మించి కృష్ణానదిని మరో మూసీ నదిగా మార్చవద్దని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతల నుంచి స్వచ్ఛందంగా భూములు సేకరించాలి... రైతులను భయబ్రాంతులకు గురి చేయొవద్దని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు. భూములు పారిశ్రామికవేత్తలు, బినామీలకు కట్టబెట్టాలని చూసే ఐక్యంగా ఉద్యమిస్తామని చంద్రబాబు ప్రభుత్వాన్ని లక్ష్మణ్రెడ్డి హెచ్చరించారు. పోలీసు యంత్రాంగంపై సీఎం చంద్రబాబు, హోం మంత్రి చినరాజప్ప చేసిన ప్రకటనలను ఈ సందర్బంగా లక్ష్మణ్రెడ్డి ఖండించారు.

మరిన్ని వార్తలు