మద్యం వ్యాపారులతో చంద్రబాబు కుమ్మక్కు

23 Jul, 2014 02:17 IST|Sakshi

 నరసాపురం టౌన్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మద్యం వ్యాపారులతో కుమ్మక్కయ్యారని సీపీఎం కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. నరసాపురంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మద్యం అమ్మకాలు ద్వారా వచ్చే ఆదాయంతోనే రాష్ట్రాన్ని ముందుకు నెట్టాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని విమర్శించారు. మద్యం బెల్టు షాపులను తొలగించేందుకు సైతం కమిటీలంటూ ముఖ్యమంత్రి కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతు, డ్వాక్రా రుణాలను తక్షణమే మాఫీ చేయాలని, లేదంటే పెద  ఎత్తున ఉద్యమం చేపడ తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నికల ముందు ఒకమాట, ఎన్నికల తర్వాత మరో మాట చెప్పడం చ ంద్రబాబుకు తగదన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తే సహించేది లేద న్నారు.  
 
 రిలయన్స్ అధినేతలతో చంద్రబాబు మిలాఖత్ అయ్యారని, అందుకే ఆంధ్రాకు రావలసిన గ్యాస్ వాటాపై ఆయన నోరు మెదపడంలేదన్నారు. గ్యాస్ పైప్‌లైను ప్రమాదాల వల్ల అమాయక ప్రజలు బలి అయిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. గ్యాస్ ఆధారిత పరిశ్రమల స్థాపనతో రైతులకు మేలు జరగాలని, నిరుద్యోగులకు ఉపాధి దొరకాలని వివరించారు.  తెలంగాణ రాష్ట్రంలో సెటి లర్స్‌కు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వబోమని చెప్పటం అన్యాయమని అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి శ్రద్ధ వ హించి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. రాష్ట్ర విభజన వల్ల ఇలాంటి సమస్యలు ఎన్నో వస్తాయనే తాము వ్యతిరేకించామని చెప్పారు. కోనసీమ, కోటిపల్లి రైల్వేలైను నిర్మాణం చేపట్టి పూర్తి చేయాలని రాఘవులు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు ఓడ రేవుల ఏర్పాటులో నిర్లక్ష్యంతో అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదని పేర్కొన్నారు.
 
 నరసాపురంలో ఓడ రేవు నిర్మించాలి
 సముద్ర ముఖద్వారంలో ఉన్న నరసాపురం ప్రాంతంలో ఓడల రేవు నిర్మించాలని బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. బ్రిటిష్ వాళ్లు ఇక్కడి నుంచి సముద్రయానం ద్వారా వర్తక, వాణిజ్యాలు సాగించారనే విషయం గుర్తు చేసారు. ఓడలరేవు నిర్మిస్తే జిల్లాలోని తీరప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు.
 

మరిన్ని వార్తలు