ఇంట్లోకి దూసుకెళ్ళిన లారీ

7 Sep, 2017 13:28 IST|Sakshi
- తప్పిన పెనుప్రమాదం
 
విజయవాడ: భారీ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన విజయవాడలోని రాజీవ్‌ నగర్‌లో గురువారం ఉదయం చోటు చేసుకుంది. రాజీవ్‌ నగర్‌ రోడ్‌లో వెళ్తున్న లారీని డ్రైవర్‌ మలుపు తిప్పే ప్రయత్నంలో అదుపతప్పి ఇంటి ప్రహరిలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ప్రహరీ వద్ద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.  ప్రమాదంలో ప్రహరీ సమీపంలోని ఒక మోటార్ వాహనం, 4  సైకిళ‍్లు ధ్వంసం అయ్యాయి. లారీని పోలీస్ స్టేషన్ కు తరలించారు. డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
మరిన్ని వార్తలు