తల్లీ బిడ్డలకు‘ఆరోగ్య రాజ్యం’!

27 Jan, 2014 01:36 IST|Sakshi

    మాతా శిశు మరణాల్లో హై రిస్క్ జిల్లాగా విశాఖ
     తల్లీ, పిల్లల కోసం ప్రత్యేక బ్లాకుకు కలెక్టర్ ప్రతిపాదనలు
     ఈఎన్‌టీ ఆస్పత్రి ఎదురుగా స్థలం గుర్తింపు
     వారంలోగా ప్రభుత్వానికి నివేదిక

 
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో పెరుగుతున్న మాతాశిశు మరణాల సంఖ్య కలవరపెడుతోంది. ఏటా ప్రసవ సమయాల్లోనే వందల సంఖ్యలో తల్లీ, బిడ్డల ప్రాణాలు పోతున్నాయి. రవాణా వ్యవస్థ మెరుగైనా జిల్లాలో ఇంకా ఇళ్ల వద్దే వేల సంఖ్యలో ప్రసవాలు జరుగుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతున్న ఈ కాలంలో గర్భిణులకు మెరుగైన వైద్య సదుపాయం, పోషకాహారం అందక మరణాలు సంభవిస్తున్నాయి.

రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందిన నగరంగా గుర్తింపు పొందిన విశాఖ.. మాతా శిశు మరణాల్లో కూడా హైరిస్క్ జిల్లాగా గుర్తింపు పొందడం ఇక్కడి పరిస్థితికి నిదర్శనం. జిల్లాలో కేజీహెచ్, విక్టోరియా వంటి ప్రభుత్వాస్పత్రులు ఉన్నా అవి ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. అవసరమైన నిధులు విడుదల చేయకపోవడంతో వీటిలో పూర్తి స్థాయి వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు. దీంతో జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం(ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) కింద కేంద్ర నిధులతో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఇంటిగ్రేటెడ్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్(ఐఎంసీహెచ్) బ్లాక్ నిర్మాణానికి కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.
 
ప్రభుత్వాస్పత్రుల్లో తగ్గుతున్న ప్రసవాలు

 
జిల్లాలో ప్రతి నెలా సుమారు ఆరు వేల ప్రసవాలు జరుగుతున్నాయి. ఇందులో 3 వేలు నగరంలో, మరో 3 వేలు గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. కేజీహెచ్, విక్టోరియా ప్రభుత్వాస్పత్రుల్లో నెలకు 1100 నుంచి 1200 మధ్య ప్రసవాలు జరుగుతున్నాయి. విక్టోరియా ఆస్పత్రి కాలుష్య వాతావరణంలో ఉండడంతో ఇక్కడ ప్రసవాలు.. తల్లీ, బిడ్డల ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదముందని వైద్యులే చెబుతున్నారు.

రోజుకు 15 నుంచి 20 వరకు డెలివరీలు జరిగే ఈ ఆస్పత్రిలో ఒకే ఒక్క స్కానింగ్ మెషిన్ ఉంది. ముందు వచ్చిన 25 మంది గర్భిణులకు మాత్రమే స్కానింగ్ తీస్తున్నారు. దీంతో స్కానింగ్ కోసం అర్ధరాత్రి నుంచి గర్భిణులు ఇబ్బందులు పడుతూ లైన్లలో ఉండాల్సి వస్తోంది. పుట్టిన పసికందులకు ఎటువంటి వైద్య సేవలు అవసరమున్నా వారిని కేజీహెచ్‌కే పంపిస్తున్నారు. కేజీహెచ్‌లో కూడా అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల శాతం ఏ మాత్రం పెరగడం లేదు.
 
తగ్గని గృహ ప్రసవాలు
 
జిల్లాలో ప్రభుత్వాస్పత్రులు, డిస్పెన్సరీలతో పాటు ప్రయివేట్ ఆస్పత్రులు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ ఇప్పటికీ వందల సంఖ్యలో ఇళ్ల వద్దే ప్రసవాలు జరుగుతున్నాయి. దీంతో మాతా శిశు మరణాల సంఖ్య కూడా విపరీతంగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మాతా శిశు మరణాల్లో విశాఖ హై రిస్క్ జిల్లాగా రీప్రొడక్టివ్, మెటర్నల్, నియోనాటల్ అండ్ చైల్డ్ హెల్త్(ఆర్‌ఎంఎన్‌సీహెచ్) సంస్థ ఇప్పటికే ప్రకటించింది.
 
ఐఎంసీహెచ్‌కు ప్రతిపాదనలు
 
జిల్లాలో మాతా శిశు మరణాల సంఖ్యను తగ్గించడంతో పాటు ప్రభుత్వాస్ప్రతుల్లో ప్రసవాల శాతం పెరిగేందుకు గల అవకాశాలపై కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ దృష్టి సారించారు.
 

మరిన్ని వార్తలు