తండ్రి కాబోతున్న యంగ్‌ హీరో నిఖిల్‌

13 Nov, 2023 07:43 IST|Sakshi

'హ్యాపీడేస్'​ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన స్టార్ హీరో నిఖిల్​ ప్రస్తుతం వరుస ఆఫర్లతో సందడి చేస్తున్నారు. 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా లెవెల్​లో గుర్తింపు పొందిన నిఖిల్‌.. తాజాగా 'స్వయంభూ' సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో నిఖిల్​ ఓ వారియర్​ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే దీని కోసం ఆయన తీవ్ర కసరత్తులు చేస్తున్నారు.

ఈ సినిమా కోసం దాదాపు మూడు నెలలపాటు  యుద్ధవిద్యలపైనే నిఖిల్ శిక్షణ తీసుకున్నారు. ఇలా ఒక సినిమా కోసం హీరోలు ఇంతలా శ్రమించడం చాలా అరుదు. నిఖిల్‌కు 'స్వయంభూ' 20వ సినిమా కాగా.. ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్​తో రూపొందుతున్న చిత్రమిది.

అయితే నిఖిల్ సతీమణి పల్లవి ప్రెగ్నెట్ అని వార్తలు సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. 2020లో డాక్ట‌ర్ ప‌ల్ల‌వి వ‌ర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నిఖిల్‌. కొద్దిరోజుల క్రితం నిఖిల్‌ తన భార్యతో ఒక ఫ్యామిలీ ఈవెంట్‌కు వెళ్లగా అక్కడ ఆమె బేబీ బంప్‌తో కనిపించారని ఆయన అభిమానులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. కానీ ఈ విషయంపై వారిద్దరూ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇప్పటికే మరో హీరో శర్వానంద కూడా తండ్రి కాబోతున్నాడనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు