మూల్యాంకనంలో మొబైల్‌ వాడొద్దు!

4 Apr, 2018 12:07 IST|Sakshi
పత్రాలను పరిశీలిస్తున్న ఆర్‌జే ప్రతాప్‌రెడ్డి, డీఈఓ శైలజ

కడప ఎడ్యుకేషన్‌: పదో తరగతి మూల్యాంకన కేంద్రంలో పేపర్లు దిద్దే  సమయంలో ఎవరైనా సెల్‌ఫోన్‌ మాట్లాడితే కఠి న చర్యలు తీసుకుంటామని ఆర్‌జేడీ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి హెచ్చరిం చారు. మూల్యాంకన కేంద్రాలైన మున్సిపల్‌ హైస్కూల్‌ తో పాటు, ఉర్దూ బాలుర నగరకోన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పేపర్లు ఏ విధంగా మూల్యాంకనం చేస్తున్నారు, వసతులు ఎలా ఉన్నాయనే దానిపై పరిశీలించారు. ఇదే సమయంలో మొయిన్, ఉర్దూ హైస్కూల్‌లోని మూల్యాం కన కేంద్రాలలో ఇద్దరు సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ పేపర్లు దద్దుటాన్ని గమనించిన ఆర్‌జేడీ షోకాజ్‌ నోటీసులను ఇవ్వాలని ఆదేశించారు. అలాగే మెయిన్‌ స్కూల్‌ కేంద్రంలో ఒకరు టోటల్‌ మార్కులను సక్రమంగా వేయకపోవడాన్ని గమనించి షోకాజ్‌ నోటీసులను ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలు మీ చేతుల్లో ఉన్నాయని జాగ్రత్తగా ఉండాలన్నారు. మూల్యాంకనంలో పర్యవేక్షించే అధికారులు కూడా సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. ఆర్‌జేడీ వెంట డీఈఓ శైలజ, డీసీఈబీ సెక్రటరీ నారాయణరెడ్డి, డిప్యూటీ ఈఓలు ఉన్నారు.

మరిన్ని వార్తలు