ట్రిపుల్ ఐటీ ఎదుట టీడీపీ ఎంపీ ఆందోళన

26 Feb, 2014 11:59 IST|Sakshi

బాసర ట్రిపుల్ ఐటీ భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి నాగరాజు కుటుంబానికి రూ. 10 లక్షల నష్ట పరిహారం అందజేయాలని స్థానిక ఎంపీ రమేష్ రాథోడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ట్రిపుల్ ఐటీ భవనం ఎదుట ఆయన ఆందోళన చేపట్టారు. నాగరాజు ఆత్మహత్యకు కారకులైన వారిని అరెస్ట్ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. రాష్ట్రంలోని పలు ట్రిపుల్ ఐటీలలో ఇటీవల విద్యార్థులు తరచుగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలు నిరోధించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. రమేష్ రాథోడ్ చేపట్టిన ఆందోళనలో భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.



నల్గొండ జిల్లా కనగరి మండలం గౌరారం గ్రామానికి చెందిన నాగరాజు బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం ఉదయం ఏడు గంటలకు బీహెచ్-1 భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థులు వెంటనే స్పందించి కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. అయితే నాగరాజును ఆసుపత్రికి
తరలించేందుకు కళాశాల యాజమాన్యం ఆలసత్వం వహించింది. దాంతో నాగరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన
సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు