‘జగనన్నకు పేదవాడి మట్టి వాసన తెలుసు’

23 Nov, 2023 18:04 IST|Sakshi

ప్రత్తిపాడు(కాకినాడ జిల్లా): వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సుయాత్రలో భాగంగా 19వ రోజు కాకినాడ నియోజకవర్గంలో కొనసాగింది. దీనిలో భాగంగా ప్రత్తిపాడు అల్లూరి సీతారామరాజు సెంటర్‌లో ఏర్పాటు చేసిన భారీ  బహిరంగ సభకు జనసంద్రం పోటెత్తింది. ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ ఆధ్వర్వంలో జరిగిన ఈ బహిరంగ సభకు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు హాజరయ్యారు.

ఎమ్మెల్యే కొలుసు  పార్థసారథి మాట్లాడుతూ.. ‘ఆత్మగౌరంతో బతికేలా సీఎం జగన్ ఏలాంటి పాలన చేశారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు ఆలోచన చెయ్యాలి. క్యాబినేట్,ఛైర్మన్ పదవుల్లో ఉన్నత స్ధానం బడుగు బలహీన వర్గాలకు ఇచ్చారు.  సామాజి న్యాయంతో అధికార, వనరుల పంపిణీ అన్ని వర్గాలకు చేశారు.30 లక్షల మందికి ఇళ్ళ స్ధలాలు ఇచ్చి ఇళ్లు కట్టుకునేందుకు ఆర్ధిమ సహయం చేశారు. గత ప్రభుత్వం లో వారి మనుషులైతే పథలు ఇచ్చేవారు.అర్హత ఆధారంగా పధకాలు అందజేసిన ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.పేద వాడికి అత్యంత గౌరవం సీఎం జగన్‌ కల్పించారు’ అని స్పష్టం చేశారు.

మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత బడుగు,బలహీన వర్గాలకు భరోసా లభించింది.  ఏపీ చరిత్రలో రూ. 240 కోట్లు పేదవారికి సంక్షేమ పథకాల ద్వారా నేరుగా అందించారు. ఎస్సీలగా పుట్టాలని కోరుకుంటారా? బీసీల తోకలు కట్ చేస్తానన్న చంద్రబాబు.  టీడీపీ ఇచ్చిన 600 హమీలు అమలు చేసిందా?, కాకమ్మ కబుర్లు చెప్పే చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రిని చూశాం. పేదల కోసం పెద్ద పీట వేసిన సీఎం జగన్‌నూ చూశాం. చంద్రబాబు వల్ల బడుగు,బలహీన వర్గాలు మోసపోయాయి. సీఎం జగన్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకు అవసరం. చంద్రబాబును కుయోక్తులను నమ్మద్దు అని ప్రజలను కోరుతున్నా. చంద్రబాబుకు రాజకీయాల్లో ఉండే అర్హత లేకుండా చెయ్యాలి’ అని తెలిపారు.

ఎంపీ నందిగాం సురేష్‌ మాట్లాడుతూ..  ‘ జగనన్నకు పేదవాడి మట్టి వాసన తెలుసు. పాదయాత్రలో పేదలను చూసి వారి జీవితాల్లో వెలుగులు నింపాలనుకున్నారు. పేదల జీవితాల్లో వెలుగులు ఆర్పేసిన వ్యక్తి చంద్రబాబు.  మన సంపదనను చంద్రబాబు దోచుకున్నాడు. ఐదేళ్ళ పాలనలో మనపై చంద్రబాబు పెత్తనం చేశాడు. మన జీవితాల్లో వెలుగు ఇచ్చిన ఏకైక వ్యక్తి సీఎం జగన్‌. చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు పథకం గుర్తుకు వస్తుంది. పవన్‌ కళ్యాణ్‌కు చంద్రబాబు పొడుస్తాడు. 2019లో చంద్రబాబును దోపిడీదారుడు అని విమర్శించిన పవన్‌.. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు పంచన చేరాడు’ అని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు