చేటు తెచ్చిన...‘నారా’ నాలుక !

10 May, 2014 07:53 IST|Sakshi
చేటు తెచ్చిన...‘నారా’ నాలుక !

* సీమాంధ్రను సింగపూర్ చేస్తానంటున్న చంద్రబాబుకు  అక్కడ వ్యవసాయ భూములు లేని విషయం తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ  సీమాంధ్రను సింగపూర్ చేస్తే రైతులను ఎక్కడకు పంపుతారని ప్రశ్నిస్తున్నారు.

* విశ్వసనీయత లేని వాగ్దానాలు చేయడం ఒక కారణమైతే, గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రవర్తించిన తీరు మరో కారణమని విశ్లేషించుకుంటున్నారు.

*సినీ నటుడు పవన్ కల్యాణ్‌ను తెచ్చుకుని, అతనితో ప్రచారం చేయడం కూడా తెలుగు దేశం పార్టీ పట్ల వ్యతిరేకతకు దారితీసిందని అంటున్నారు. పవన్ అభిమానుల్లో సగం మంది ఓటు హక్కు లేని వారే కావడం, వారి దుందుడుకు ప్రవర్తన ఓటర్లను అసహనానికి గురి చేసిందంటున్నారు.

*బీజేపీతో పొత్తు పెట్టుకుని మరో తప్పు చేశారని కూడా ఆ పార్టీనాయకులు భావిస్తున్నారు. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని చారిత్రక తప్పిదం చేశానని చెప్పుకున్న చంద్రబాబు, నేడు బీజేపీతో పొత్తు చారిత్రక అవసరమని చెప్పుకొచ్చారు.  ఆయన అనుకుంటే ఏదైనా చారిత్రక అవసరమేనా అని ప్రశ్నిస్తున్నారు.

 *ప్రధానంగా రాష్ట్ర విభజనను అడ్డుకోక పోగా, కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయ్యి అడ్డగోలుగా విభజించడంపై  ఓటర్లు ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము లేఖ ఇవ్వడం వల్లే తెలంగాణ  ఏర్పడిందని అంటూ తెలంగాణ  ప్రాంతంలో చెప్పుకున్న చంద్రబాబు, సీమాంధ్రకు రాగానే కాంగ్రెస్ విభజన చేయడాన్ని తప్పుపడుతూ వచ్చారు.

* వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని ఎన్‌టీఆర్ హెల్త్ స్కీంగా తీసుకుని వస్తానని చెప్పడం,  ఉన్న పథకాలను తిరిగి తీసుకుని వస్తాననడం కూడా మైనస్ అయ్యిందని బాధపడుతున్నారు.

 *చంద్రబాబు హామీల్లో ఎక్కువగా వైఎస్ హయాంలో పథకాలే ఉన్నాయని అంటున్నారు.

 *వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రకటించిన కొత్త పథకాలు, ఆయనలో ఉన్న విశ్వసనీయతను చూసి  ఓటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులయ్యారని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు