Nov 14th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

14 Nov, 2023 21:15 IST|Sakshi

చంద్రబాబుకు ముంచుకొస్తున్న జైలు ముహూర్తం

రాజకీయ చర్చలతో బిజీ బిజీగా చంద్రబాబు

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు సర్వప్రయత్నాలు

సామాజిక వర్గం, టిటిడిపి నేతలతో నిరంతరాయంగా చర్చలు

కేసుల రూపంలో వెంటాడుతున్న తప్పులు, అక్రమాలు

వరుస పిటిషన్లతో కోర్టులపై ఒత్తిడి తెచ్చే కుట్ర

Chandrababu Naidu Cases, Petitions, & Political Updates

7:24 PM, Nov 14, 2023
ఇదెక్కడి సమన్వయం?.. రచ్చ రచ్చే!
► పొత్తు తర్వాత బయటపడుతున్న జనసేన-టీడీపీ కేడర్‌ మధ్య విబేధాలు
► ఇవాళ కాకినాడ పిఠాపురంలో అదే సీన్‌
► పాత టీడీపీ కార్యాలయం వద్ద జరిగిన రెండు పార్టీల సమన్వయ కమీటీ సమావేశం రచ్చ రచ్చ
► గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే వర్మ
► ఈసారి సీటు తనకు ఇవ్వాలన్న నియోజకవర్గ జనసేన ఇంఛార్జి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్
► మహమహులే గత ఎన్నికల్లో ఓడిపోయారంటూ వ్యాఖ్యానించిన మాజీ ఎమ్మెల్యే వర్మ 
► పవన్ కల్యాణ్‌ గురించే ఆ వ్యాఖ్యలంటూ వాగ్వాదానికి దిగిన జనసేన కేడర్‌
► పరస్పర దూషణలు, కుర్చీల విసిరివేతతో ఉద్రిక్తత 

2:24 PM, Nov 14, 2023
ఉండవల్లి కేసులో ఏం జరగవచ్చు?
► చంద్రబాబు స్కిల్‌ కేసును CBIకి అప్పగించాలంటూ హైకోర్టులో గత నెలలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ పిటిషన్‌
► దీనికి సంబంధించి ఇప్పటికే 44 మందికి నోటీసులు
► స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం తీవ్రత దృష్ట్యా కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి బదిలీ చేయాలని విజ్ఞప్తి
► సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీఐడీలకు నోటీసులు
► కుంభకోణంలో కీలక నిందితులైన చంద్రబాబు, అచ్చె­న్నా­యుడు, అప్పటి అధికారులు గంటా సు­బ్బా­రావు, డాక్టర్‌ కె.లక్ష్మీ­నారా­యణ, నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, డిజైన్‌టెక్‌ ఎండీ వికాస్‌ వినయ్‌ కన్వీల్కర్, సీమెన్స్‌ మాజీ ఎండీ సుమన్‌ బోస్, సంజయ్‌ డాగా, ఐఏఎస్‌ అధి­కారిణి అపర్ణ ఉపాధ్యాయ సహా 44 మందికి హైకోర్టు నోటీసులు
► ఈ కేసును CBI దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశిస్తే.. తమకెలాంటి అభ్యంతరాలు లేవని చెప్పిన CID
► అభ్యంతరం లేదని లిఖితపూర్వకంగా చెప్పిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అడ్వొకేట్‌ జనరల్‌
► CBI దర్యాప్తు చేపడితే EDతో మరింత సులభంగా కలిసి ముందుకెళ్లే అవకాశం
► CBI, ED దర్యాప్తు వల్ల కేసు లోతుల్లోకి వెళ్లడం సులభం
► ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి నిధులు ఎలా మళ్లించాయో కనిపెట్టడం సులువు
► ఏ రకంగా చూసినా ఈ కేసును CBIకి అప్పగిస్తేనే పూర్తి కుంభకోణం బయటపడుతుందంటున్న నిపుణులు

1:42 PM, Nov 14, 2023
బాబును, బాబు మ్యానిఫెస్టోను నమ్మితే.. వెన్నుపోటే మిగిలేది.! : మంత్రి అంబటి రాంబాబు
► బాబు రుణమాఫీ అని మహిళలను మోసం చేశారు
► బంగారు రుణాలు మాఫీ అని  చంద్రబాబు చేతులెత్తేశాడు
► సీఎం జగన్ ఇచ్చిన హామీలను అన్ని అమలు చేశారు
► ఏ రాష్ట్రాల్లో కూడా అమ్మ ఒడి లాంటి పథకం లేదు
► చంద్రబాబు జైల్లో ఉంటే పవన్ తప్ప ఇతర పార్టీ వారు ఒక్కరూ వెళ్లలేదు
► చంద్రబాబు అవినీతిలో పవన్ కు వాటా ఉందా లేదా?
► కాపులను బీసీల్లో కలుపుతామని టీడీపీ వారు మోసం చేశారు
► ముద్రగడను చిత్రహింస పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు
► వంగవీటి రంగా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి చంద్రబాబు
► ఖమ్మంలో వారి సామాజిక వర్గం వారు చంద్రబాబును విమర్శలు చేస్తున్నారని దాడికి యత్నించారు
► 30 లక్షల మంది పేదలకు ఇళ్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ది
► 2024లో పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగే ఎన్నిక ఇది
► 175కు 175 ఇచ్చి జగన్‌ను సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
► రాజకీయాల్లో పార్టీని నాశనం చేసుకుని అమ్ముడు పోకూడదు
► బాబు పల్లకి మోసేందుకు జనసేనను పవన్ నాశనం చేసుకుంటున్నాడు

1:42 PM, Nov 14, 2023
ఇదేం మ్యానిఫెస్టో.. దీంతో ఏం గెలుస్తాం?
► జనసేన నుంచి బయటికొస్తున్న వ్యతిరేకతలు
► TDP, జనసేన మ్యానిఫెస్టోపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య  విమర్శలు
► TDP, జనసేన మినీ మేనిఫెస్టో తీవ్ర నిరాశకు గురి చేసింది: హరిరామ జోగయ్య 
► ఈ  మేనిఫెస్టో YSRCP సంక్షేమ పథకాలకు ఏ మాత్రం ధీటుగా లేదు : హరిరామ జోగయ్య 
► ఆంధ్రప్రదేశ్‌లోని 4 కోట్ల ప్రజలను సంతృప్తి పరిచేలా మేనిఫెస్టో ఉండాలి : హరిరామ జోగయ్య 
► హరిరామజోగయ్య తరహాలోనే మరికొందరు బయటికొచ్చి విమర్శించేందుకు సిద్ధమైన నేతలు

1:23 PM, Nov 14, 2023
సమన్వయంగా ఏం సాధిద్దాం?
►నియోజకవర్గాల వారీగా తెలుగుదేశం, జనసేన సమన్వయ సమావేశాలు
►మూడు రోజులపాటు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు
►భవిష్యత్తుకు గ్యారెంటీ, ఓటర్ లిస్టు పరిశీలన పై సమావేశాల్లో చర్చ
►ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా జరిగిన తెలుగుదేశం, జనసేన సమావేశాలు
►క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలే అజెండాగా సమన్వయ సమావేశాలు
►జైలు ముందు నాయకులు పొత్తు ప్రకటించారు కానీ, గ్రౌండ్‌ లెవల్‌ సీన్‌ డిఫరెంట్‌గా ఉందంటున్న క్యాడర్‌
►ఇన్నాళ్లు టిడిపిని ఎందుకు విమర్శించారు? ఇప్పుడు ఎందుకు చక్కనెక్కారు?
►ఇంకెన్నాళ్లు ఎజెండా పక్కనబెట్టి పక్క పార్టీ జెండా మోద్దాం?
►అసలు జనసేనకు ఎన్ని సీట్లిస్తారు? ఎక్కడెక్కడ ఇస్తారు?
►రెండు పార్టీల మ్యానిఫెస్టో అంటూ ఒకటే తయారు చేస్తున్నారు, దానికి గ్యారంటీ ఏంటీ?
►తెలంగాణ తరహాలో జనసేన అభ్యర్థులుగా టిడిపి నేతలే బరిలో దిగుతారా?
►అసలు పవన్‌కళ్యాణ్‌ ఎక్కడ పోటీ చేస్తాడు? లోకేష్‌ ఎక్కడ పోటీ చేస్తాడు?
►మీకే నియోజకవర్గాల్లో గ్యారంటీ లేకుంటే.. రెండు పార్టీల భవిష్యత్తుకు ఏం గ్యారంటీ ఉంటుంది?
►క్షేత్ర స్థాయిలో జనసేన క్యాడర్‌ను తెలుగుదేశం నేతలు అసలు పట్టించుకోవడం లేదు, దానికేమంటారు?
►కొన్ని చోట్లయితే మరీ వివక్ష చూపిస్తున్నారు, సభలు పెట్టుకుంటే వచ్చి జెండా పట్టుకోమంటున్నారు?
►జనసేన క్యాడర్‌ నుంచి తెలుగుదేశం పొత్తుపై బయటికొస్తున్న వ్యతిరేకత

1:12 PM, Nov 14, 2023
పవన్‌ కళ్యాణ్‌ పని చేస్తోంది బీజేపీ కోసమా? టిడిపి కోసమా?
►తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో అధికారికంగా పొత్తు పెట్టుకున్న పవన్‌ కళ్యాణ్‌
►బీజేపీ 111 సీట్లలో పోటీ చేస్తుండగా, పవన్‌ పార్టీ జనసేన 8 చోట్ల పోటీ
►అయినా మనసంతా చంద్రబాబే అన్నట్టుగా వ్యవహరిస్తోన్న పవన్‌ కళ్యాణ్‌
►తన అభ్యర్థులు 8 మంది బరిలో ఉన్నా.. ప్రచారం వైపు తిరిగి చూడని పవన్‌ కళ్యాణ్‌
►కేవలం ప్రధాని హైదరాబాద్‌ వచ్చినప్పుడు తప్ప .. మళ్లీ తెలంగాణలో కనిపించని పవన్‌ కళ్యాణ్‌
►పాపం.. బీజేపీ నేతలు మాత్రం ప్రతీ కటౌట్‌లో పవన్‌కళ్యాణ్‌ ఫోటోలు పెట్టి మరీ ప్రచారం
►అయినా బీజేపీ కోసం గానీ, జనసేన కోసం గానీ ప్రచారం చేయని పవన్‌ కళ్యాణ్‌
►పరోక్షంగా కాంగ్రెస్‌కు అనుకూలంగా పావులు కదుపుతున్న పవన్‌ కళ్యాణ్‌
►చంద్రబాబు డైరెక్షన్‌లో నామమాత్రంగా తెలంగాణలో కనిపిస్తోన్న పవన్‌ కళ్యాణ్‌
 

1:04 PM, Nov 14, 2023
తెలంగాణ రాజకీయాలతో చంద్రబాబు బిజీ బిజీ
►వారం రోజులుగా తెలంగాణ రాజకీయాలపై చంద్రబాబు మంత్రాంగం
►విడతల వారీగా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలతో వర్చువల్‌ మీటింగ్‌లు
►రేవంత్‌ రెడ్డికి పూర్తిగా అండగా ఉండాలని తెలంగాణ పార్టీ నేతలకు పిలుపు
►చంద్రబాబు ఆదేశాలతో నిన్న తుమ్మలను పార్టీ కార్యాలయానికి పిలిచిన ఖమ్మం టిడిపి నేతలు
►పూర్తి స్థాయిలో మద్ధతిస్తాం, ఆర్థికంగా అండగా నిలుస్తాం, ఇంకేం కావాలంటూ తుమ్మలకు ఆఫర్‌
►తెలంగాణలో కాంగ్రెస్‌ గెలవాలంటే ఎలాంటి సపోర్ట్‌ కావాలంటూ తెలంగాణ టిడిపి నేతల ఎదురు ఆఫర్లు
►అన్ని జిల్లాల్లో టిటిడిపి నేతలకు చంద్రబాబు నుంచి ఫోన్లు
►ఇక్కడ కాంగ్రెస్‌ ఉంటేనే.. మనకు ప్రయోజనం అంటూ చంద్రబాబు సందేశాలు

12:40PM, Nov 14, 2023
మీ సొంత బిజేపీ అభ్యర్థికి రాష్ట్ర అధ్యక్షులు ఓటు వేయలేదా?: ఎంపీ విజయసాయిరెడ్డి
►కారంచేడు 145 పోలింగ్‌ బూత్‌ల బీజేపీ పడిన ఆరు ఓట్లలో మీ ఓటు ఉందా ?
►మీ బావ పక్షాన పక్షపాతివై ఆంధ్రప్రదేశఖ్‌ అభివృద్ధి మీకు కంటగింపు అయిపోయింది. బీజేపీ లాంటి సిద్ధాంతం ఉన్న పార్టీలోని సిద్ధాంతాలు గాలికి వదిలేసి మీరు ఎన్నిరోజులు ఉంటారు?
►గట్టిగా మాట్లాడితే మా ఓటు అక్కడ లేదు..వైజాగ్‌లోనో రాజంపేటలోనో ఉండిపోయింది అని బొంకుతారు మళ్లీ!

8:00AM, Nov 14, 2023
పురందేశ్వరి, రామోజీలపై విజయసాయిరెడ్డి ఫైర్‌
►చంద్రబాబు కోసమే పురందేశ్వరి పనిచేస్తన్నారు
►బీజేపీలో ఎన్నాళ్లు ఉంటారో చెప్పగలరా? 
►ఎప్పటికప్పుడు పార్టీలు మార్చగల నైపుణ్యం పురందేశ్వరి సొంతం 
►చంద్రబాబు కోసమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు

►రామోజీ ఎందుకింత కడుపు మంట?
►‘ఎందుకీ ఎంపీలు?’ అంటూ రామోజీ తన కడుపు మంటను ‘ఈనాడు’ ద్వారా బయటపెట్టారు
► ‘ప్రత్యేక హోదా, స్టీల్‌ ప్లాంట్, విభజన హామీల అమలు కోసం పార్లమెంట్‌ను స్తంభింపజేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలంటూ ఈనాడులో రాసింది మరిచిపోయావా? 
►రామోజీ.. హోదా వద్దు ప్యాకేజి ముద్దు అన్న చంద్రబాబేమో పోరాట యోధుడా?

7:00AM,Nov 14, 2023
నవరత్నాలు కాపీ పేస్ట్‌.?
►మా మ్యానిఫెస్టోలో 11 అంశాలు : యనమల
►నవరత్నాల పేరుతో ఉన్న స్కీములన్నీ రద్దు చేశారు: యనమల
►అంటే మీ లక్ష్యం నవరత్నాలను రద్దు చేయడమేనా? : YSRCP


ప్రస్తుతం YSRCP ఇస్తోన్న నవరత్నాలు
1. రైతు భరోసా
2. ఆరోగ్యశ్రీ
3. అమ్మఒడి
4. పింఛన్ల పెంపు
5. పేదలందరికీ ఇళ్ళు
6. ఫీజు రీయింబర్స్ మెంట్
7. జలయజ్ఞం
8. మద్యపాన నిషేధం
9. ఆసరా, చేయూత

►ఇవే పథకాలను తిప్పి/మార్చి కొత్తగా ప్యాకింగ్‌ చేయాలన్న యోచనలో టిడిపి+జనసేన
►ఇన్నాళ్లు నవరత్నాలను తప్పుబట్టిన వాళ్లే ఇప్పుడు కాపీ కొట్టేందుకు సిద్ధమైన వైనం
►2014లో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మ్యానిఫెస్టోను మాయం చేసిన ఘనత టిడిపి+జనసేనదే

6:40AM, Nov 14, 2023
తెలంగాణలో కాంగ్రెస్‌కు జైకొట్టిన తెలుగుదేశం తమ్ముళ్లు
►కాంగ్రెస్‌కు పూర్తి స్థాయిలో మద్ధతు తెలుపుతోన్న తెలుగుదేశం
►చేతులు కలిపిన కాంగ్రెస్‌, టిడిపి
►అంతా ఓపెన్‌గానే జరుగుతున్న వ్యవహరాలు
►ఖమ్మం టీడీపీ ఆఫీస్ కు వెళ్లిన కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల
►తుమ్మలను ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించిన టీడీపీ
►టీడీపీ మద్దతును స్వాగతించిన తుమ్మల నాగేశ్వరరావు
►మరోవైపు టిడిపి మా తల్లిగారిల్లు అని ప్రకటించిన రేవంత్‌
►రేవంత్‌ గెలుపుకోసం శ్రమిస్తామని చెప్పిన టిడిపి నేతలు

చంద్రబాబు కేసుల స్టేటస్‌ ఏంటీ?
కేసు : స్కిల్ స్కాం 
అంశం : మధ్యంతర బెయిల్‌
స్టేటస్‌ : అనారోగ్యం కారణంగా  మంజూరు
వివరణ : నవంబర్‌ 28న జైలు ముందు లొంగిపోవాలి

కేసు : స్కిల్ స్కాం 
అంశం : క్వాష్‌ పిటిషన్‌
స్టేటస్‌ : సుప్రీంకోర్టులో పెండింగ్‌
వివరణ : ఈ నెలాఖరుకు తీర్పుకు ఛాన్స్‌

కేసు : స్కిల్ స్కాం 
అంశం : రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌
స్టేటస్‌ : హైకోర్టులో జరుగుతున్న విచారణ
వివరణ : నవంబర్‌ 15కి వాయిదా పడ్డ కేసు

కేసు : ఇసుక కుంభకోణం
అంశం : ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
స్టేటస్‌ : హైకోర్టులో జరుగుతున్న విచారణ
వివరణ : నవంబర్‌ 22కి తదుపరి విచారణ వాయిదా
 

కేసు : ఫైబర్‌ నెట్‌ పేరిట నిధుల దోపిడి
అంశం : ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
స్టేటస్‌ : సుప్రీంకోర్టులో పెండింగ్‌
వివరణ : నవంబర్‌ 30కి తదుపరి విచారణ వాయిదా

కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు
అంశం : ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
స్టేటస్‌ : మంజూరు చేసిన హైకోర్టు
వివరణ : ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు

కేసు : ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో అక్రమాల కేసు
అంశం : ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
స్టేటస్‌ : హైకోర్టులో జరుగుతున్న విచారణ
వివరణ : నవంబర్‌ 22కి వాయిదా పడ్డ కేసు
 

కేసు : మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు
అంశం : ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
స్టేటస్‌ : హైకోర్టులో జరుగుతున్న విచారణ
వివరణ : నవంబర్‌ 21కి వాయిదా పడ్డ కేసు.


రెండు వర్గాలుగా మారిన తెలుగుదేశం అగ్ర నేతలు
ఒక వర్గం :  ముందయితే ఎలాగైనా లోకేష్‌ను బుజ్జగించి పాదయాత్ర పునఃప్రారంభించాలి
రెండో వర్గం : ఇప్పుడు జనం ముందుకు లోకేష్ ను పంపితే పార్టీకి నష్టం. ఏదో ఒకటి మాట్లాడి అసలుకే మోసం

ఒక వర్గం :   కనీసం భువనేశ్వరీ యాత్ర నిజం గెలవాలి అయినా ప్రారంభించాలి
రెండో వర్గం : అసలే వద్దు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షలంటే బోలెడు ఖర్చు. ఎలాంటి సానుభూతి రావడం లేదు, డబ్బులెందుకు దండగ.?

ఒక వర్గం :  ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి, ఇలాగే ఉంటే.. పార్టీలో నిరాశ, నిస్తేజం, నిస్పృహ. ఎవరో ఒకరు ముందుకు రాకపోతే.. పార్టీ పరిస్థితి అంతే సంగతులు
రెండో వర్గం : పార్టీ అంటూ లోకేష్ ను ఫణంగా పెట్టుకుంటామా? చినబాబు ఢిల్లీ యాత్రలతో అలసిపోయారు, విశ్రాంతి తీసుకోనివ్వండి

మరిన్ని వార్తలు