ప్రభుత్వంపై ప్రజాసంఘాల మండిపాటు

13 Jun, 2018 13:04 IST|Sakshi

విచ్చలవిడి అమ్మకాలతో లక్షల కుటుంబాల్లో చిచ్చు

మద్యాన్ని ఆదాయ వనరుగా చూడొద్దు : ప్రజా సంఘాల ఆందోళన

సాక్షి, విజయవాడ : నగరంలోని ఎంబీ భవన్‌లో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో మద్య వ్యతిరేక ఉద్యమ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల నేతలు, వక్తలు ప్రభుత్వంపై మండిపడ్డారు. మద్యపానాన్ని ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయంటూ విమర్శించారు. మద్యాన్ని రాష్ట్రం ఆదాయ వనరుగా చూస్తోందని, పేదల ఆరోగ్యం గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదని వక్తలు మండిపడ్డారు. ఇకనైన ప్రభుత్వం మద్యం పట్ల తన వైఖరి మార్చుకోవాలంటూ హితవు పలికారు.

పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా బెల్టుషాపులు యధేచ్ఛగా కొనసాగుతున్న ప్రభుత్వ చర్యలు శూన్యమనని విమర్శించారు. ఇకనైనా బెల్టుషాపులను అరకట్టాలని వారు డిమాండ్‌ చేశారు. విచ్చలవిడి మద్యం అమ్మకాలు లక్షల కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నాయని ప్రజా సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి లక్ష్మణరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ నేత తులసీ రెడ్డి, ఏపీ మహిళా సంఘం కార్యదర్శి దుర్గా భవానీ, కార్పొరేటర్ అవుతు శైలజ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు