కుటుంబమంతా చూడాల్సిన చిత్రం

20 Nov, 2023 04:14 IST|Sakshi
రామచంద్రరావు, సుమన్, తేజ్‌

సుమన్‌ 

‘‘మాధవే మధుసూదన’ సినిమాని రామచంద్ర రావుగారు చాలా స్పష్టతతో తీశారు. ప్రతి సన్నివేశంలో ఆయన అనుభవం నాకు కనిపించింది. కుటుంబమంతా కలిసి థియేటర్స్‌లో చూడాల్సిన చిత్రం ఇది’’ అని నటుడు సుమన్‌ అన్నారు.

తేజ్‌ బొమ్మదేవర, రిషికి లోక్రే జంటగా నటించిన చిత్రం ‘మాధవే మధుసూదన’. బొమ్మదేవర శ్రీదేవి సమర్పణలో బొమ్మదేవర రామచంద్ర రావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ మూవీ ఈ నెల 24 విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో బొమ్మదేవర రామచంద్రరావు మాట్లాడుతూ – ‘‘సినిమా ఇండస్ట్రీలో నాకు 45 ఏళ్ల అనుభవం ఉంది.

నేనే డైరెక్టర్,ప్రోడ్యూసర్‌గా మా అబ్బాయి తేజ్‌ని హీరోగా పెట్టి సినిమా చేశా. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు. ‘‘మాధవే మధుసూదన’తో ఒక మంచి ప్రయత్నం చేశాం’’ అని తేజ్‌ బొమ్మదేవర అన్నారు. 

మరిన్ని వార్తలు