రెండోరోజూ.. నిరసనల హోరు

26 Jul, 2014 03:28 IST|Sakshi
రెండోరోజూ.. నిరసనల హోరు
  •       రుణమాఫీ నిర్ణయంపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కొనసాగిన ఆందోళనలు
  •      పల్లెపల్లెనా చంద్రబాబు దిష్టిబొమ్మల దహనం
  •      నేడు కొనసాగనున్న ఆందోళనలు..దిష్టిబొమ్మల దహనాలు
  • రుణమాఫీ ప్రకటనపై మాట తప్పిన సీఎం చంద్రబాబునాయుడు వైఖరికి నిరసనగా జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రెండోరోజూ పల్లె, మండల, పట్టణ కేంద్రాల్లో చంద్రబాబు దిష్టిబొమ్మలు దహ నం చేశారు. పుంగనూరులో మహిళా సంఘాలు స్వచ్ఛందంగా తరలివచ్చి ధర్నా చేపట్టారు. ‘నరకాసురవధ’ పేరుతో నిర్వహిస్తున్న ఈ ఆందోళనలు శనివారమూ కొనసాగనున్నాయి.
     
    సాక్షి, చిత్తూరు: రైతు, డ్వాక్రా రుణమాఫీపై చంద్రబాబు ద్వంద్వవైఖరికి నిరసనగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా వైఎ స్సార్‌కాంగ్రెస్‌పార్టీ శ్రేణులు రెండోరోజూ ఆందోళనలు చేపట్టారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటినగరం, పాలసముద్రం, శ్రీరంగరాజ పురం మండలాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. కార్వేటి నగరం ఆందోళనలో ఎమ్మెల్యే నారాయణస్వామి పాల్గొన్నా రు.

    ఇచ్చిన మాట మేరకు సంపూర్ణంగా రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళెంలో ఎమ్మె ల్యే సునీల్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టా రు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదా లు చేశారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీకి పోటీగా రుణమాఫీపై సంబరాలు నిర్వహిం చారు.  

    ఒకరికొక రు పోటాపోటీగా నినాదాలు సాగిం చారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితి చేయిదాటకుండా చూశారు. రైతు, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటన చేసేవరకూ ఆందోళనలు విరమించేది లేదని సునీల్ స్పష్టం చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలోని రామాం జిపురం సర్కిల్ లో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. నమ్మిం చి వంచిం చడం చంద్రబాబుకు కొత్తేమీ కాదని, ఈ ఎన్నికల్లోనూ తన నిజస్వరూపాన్ని బ యటపెట్టారని చెవిరెడ్డి విమర్శించారు. రుణమాఫీ చేసేవరకూ వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందన్నారు.

    చిత్తూరు రూరల్ పరిధి లో పార్టీ సమన్వయకర్త జంగాలపల్లి శ్రీనివాసులు ఆధ్వర్యంలో చిత్తూరు- తిరుత్తణి రోడ్డులోని బీఎన్‌ఆర్ పేట చెక్‌పోస్టు వద్ద నిరసన కార్యక్రమాలను చేపట్టారు. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసేందుకు వైఎ స్సార్‌పీపీ శ్రేణులు యత్నించగా పోలీసు లు అడ్డుకున్నారు. ధర్నాలో మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీ దేవి, పార్టీ నేతలు, ఎంఎస్ బాబు, రాజా, పూల రఘునాథరెడ్డి పాల్గొన్నారు.

    సత్యవేడు, వరదయ్యపాళెంలో పార్టీ సమన్వయకర్త ఆదిమూలం ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. పుంగనూరులో లిడ్ క్యాప్ మాజీ చైర్మన్ రెడ్డెప్ప, జెడ్పీటీసీ సభ్యుడు వెంకటరె డ్డి, ఎంపీపీ నరసింహులు ఆధ్వర్యంలో ధ ర్నా, రాస్తారోకో చేపట్టారు. 30 డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు స్వచ్ఛం దంగా ఆందోళనలు చేపట్టారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మం డలంలో గోపాలపురం వద్ద కోటేశ్వరరావు ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. శనివారం ‘నరకాసురవధ’ పేరుతో నిరసన కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
     

మరిన్ని వార్తలు