సేవలు బంద్

31 May, 2014 02:01 IST|Sakshi

నేటి నుంచి మూడు రోజుల పాటు సబ్‌రిజిస్ట్రార్,రవాణా శాఖల్లో నిలిచిపోనున్న సేవలు
రాష్ట్ర విభజన నేపథ్యంలో సర్వర్ల మార్పే కారణం
వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ ఏపీ 27 యథాత థం

 
 ఒంగోలు టౌన్

 రాష్ట్ర విభజన నేపథ్యంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో మూడు రోజుల పాటు సేవలు నిలిచిపోనున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖతో పాటు, రవాణా శాఖలో నేటి నుంచి జూన్ 2వ తేదీ వరకు లావాదేవీలు జరగవని ఆయా శాఖల అధికారులు జిల్లా రిజిస్ట్రార్ అబ్రహం, రవాణాశాఖ అధికారి కృష్ణమోహన్ తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఒక్కో రాష్ట్రానికి విడివిడిగా కంప్యూటర్లలో సర్వర్లు మార్పు చేస్తుండటం వల్ల ఈ అంతరాయం ఏర్పడిందన్నారు. కంప్యూటర్లకి సంబంధించి ఆన్‌లైన్‌లో  సాంకేతిక పరమైన ఏర్పాట్లు చేయడానికి ఈ మూడు రోజుల వ్యవధి అధికారులు తీసుకుంటున్నారు. జిల్లాలోని 18 సబ్‌రిజిస్ట్రార్ కార్యాల యాల్లో ఎలాంటి లావాదేవీలు జరగవు. ఈసేవా, మీసేవా కేంద్రాల్లో కూడా ఎలాంటి ఈసీలు, నకళ్లతో పాటు అన్ని రకాల సేవలు అందుబాటులో ఉండవు.

 జిల్లా రిజిస్ట్రేషన్ సీరియల్ కోడ్ యథాతథం:

 ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ జిల్లాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సీరియల్ కోడ్ ఏపీ 27 యథాతథంగా ఉంటుందని జిల్లా రవాణాశాఖ అధికారి కృష్ణమోహన్ తెలిపారు. రాష్ట్రం విడిపోవడంతో ఎనిమిది చెక్‌పోస్టులు అదనంగా వచ్చాయన్నారు. నాగార్జునసాగర్ వద్ద ఒకటి, మాచర్ల వద్ద మరో చెక్‌పోస్టు మనకు దగ్గరలో రానున్నాయన్నారు. మొత్తం మీద కొత్త రాష్ట్రానికి గుంటూరు, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలు, కృష్ణా, కర్నూలు, ప్రకాశం జిల్లాలు తెలంగాణ జిల్లాలతో కలిసే చోట చెక్‌పోస్ట్‌లు కొత్తగా ఏర్పాటు చేయనున్నారని ఆయన పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు