సెప్టెంబరు 2నుంచి షర్మిల బస్సు యాత్ర

29 Aug, 2013 15:38 IST|Sakshi
సెప్టెంబరు 2నుంచి షర్మిల బస్సు యాత్ర

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల సెప్టెంబరు 2 నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు.  ఆ రోజు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద షర్మిల నివాళులర్పించి బస్సుయాత్ర  ప్రారంభిస్తారు. రాష్ట్ర విభజన విషయంలో ఇరుప్రాంతాలకు సమన్యాయం చేయాలని, అలా చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్తో ఆమె ఈ యాత్ర చేయనున్నారు. సీమాంధ్ర జిల్లాలలో ఆమె బస్సు యాత్ర చేస్తారు.

షర్మిల 230 రోజులపాటు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర  చేసిన విషయం తెలిసిందే. పాదయాత్ర కూడా అమె ఇడుపులపాయ నుంచే ప్రారంభించి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగించారు. పాదయాత్రలో ఆమె అన్ని వర్గాల ప్రజలను కలుసుకున్నారు. వారికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ఏకపక్ష, నిరంకుశ వైఖరికి నిరసనగా బస్సుయాత్ర చేయనున్నారు. సమన్యాయం చేయలేకపోతే, రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని కూడా ఆమె కోరుతున్నారు.

మరిన్ని వార్తలు