స్వభావాన్ని సంస్కరించుకోవడమే సాధనం

12 Jan, 2014 01:45 IST|Sakshi
  •     జగద్గురు పీఠం భౌగోళిక అధ్యక్షుడు పార్వతీకుమార్
  •      సింహాచలంలో ఘనంగా గురుపూజోత్సవాలు
  •      దేశ విదేశాల నుంచి సాధకులు హాజరు
  •  
     సింహాచలం, న్యూస్‌లైన్ : స్వభావంలో నుంచే భావా లు పుడుతుంటాయని, స్వభావాన్ని సంస్కరించుకోవడమే సాధనమని జగ ద్గురు పీఠం భౌగోళిక అధ్యక్షుడు మాస్టర్ కంభంపాటి పార్వతీకుమార్ అన్నారు.  సిం హాచలంలో 53వ గురుపూజా మహోత్సవాలు శనివా రం  ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇక్కడి స్వామి క ల్యాణ మండపంలో మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకలకు హాజరైన సాధకులనుద్దేశించి పార్వతీకుమార్ ప్రసంగించారు. సత్పురుషుల్లో సదావగాహన సహజంగా ఉంటుందన్నారు.

    సద్గురువుల స్పర్శ ల భించడం, గురువాక్కులను పాటించి జీవించడం సా ధకుల జీవితంలో అరుదైన విషయమన్నారు. ఈ కా ర్యక్రమంలో భాగంగా పలు గ్రంథాలను ఆవిష్కరించారు. మాస్టర్ ఇ.కె. మాస్టర్ జాలాకూల్ పరమ గురువుల గ్రంథాల్లోని జ్ఞానాన్ని వివరించారు. అంతర్జాతీయ జగ ద్గురుపీఠం అధ్యక్షుడు డాక్టర్ కె.ఎస్.శాస్త్రి మాట్లాడుతూ జోతిష్యం, వేద జ్ఞానం, క్రతు రంగాల కు సంబంధించిన జ్ఞానాన్ని, సమన్వయాన్ని పంచిపెట్టడానికి జగద్గురు పీఠం కృషి చేస్తున్నట్టు చెప్పారు.

    ఈ సందర్భంగా మాస్టర్ పార్వతీకుమార్ దంపతులు నారాయణ హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత్‌తో పాటు జర్మనీ, బె ల్జియం, స్పెయిన్, అర్జెంటీనా,  స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన 30 మంది విదేశీ సాధకులు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి ఉట్టిపడే దుస్తుల్లో వీరింతా తరలిరావడం విశేషం.
     

మరిన్ని వార్తలు