ఒంటిమిట్టలో వైభవంగా ధ్వజారోహణం

28 Mar, 2015 11:52 IST|Sakshi

ఒంటిమిట్ట : కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా శనివారం ఉదయం ధ్వజారోహణం నిర్వహించారు. ధ్వజారోహణ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రి కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు.

కాగా ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ వేడుకలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. శుక్రవారం సాయంత్రం అంకురార్పణతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఏప్రిల్ 2న జరిగే సీతారాముల కల్యాణోత్సవంలో గవర్నర్ నరసింహన్‌తో పాటు, ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా