పింఛన్ల పునరుద్ధరణకు హైకోర్టు ఆదేశం

4 Feb, 2016 00:34 IST|Sakshi
పింఛన్ల పునరుద్ధరణకు హైకోర్టు ఆదేశం

ఎచ్చెర్ల : తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రరుుంచిన బాధితులకు న్యాయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... తమ పింఛన్లను జన్మభూమి- మా ఊరు కమిటీలు అకారణంగా తొలగించాయని, అర్హత ఉన్నా రాజకీయ కక్ష నేపథ్యంలో తమ జీవనాధారాన్ని దెబ్బ తీశారని ఫరీదుపేట గ్రామానికి చెందిన ఆరుగురు హైకోర్టును ఆశ్రయించారు. తాము జనవరి 21న కోర్టును ఆశ్రరుుంచగా అనుకూలంగా కోర్టు ఉత్తర్వుల ప్రతి బుధవారం అందిందని వారు చెప్పారు.

తమలో పైడి అప్పారావు, కొత్తకోట చెల్లన్నలకు వృద్ధాప్య పింఛన్, కొత్తకోట పద్మావతికి వికలాంగ పింఛన్ పునరుద్దరించాలని ఉత్వర్వుల్లో పేర్కొన్నట్టు తెలిపారు. కొత్తకోట అమ్మాయమ్మ, కొత్తకోట సూర్యనారాయణ(అర్జెంట్ నోటీస్)లకు ఎందుకు కొత్త పింఛన్లు అందజేయడం లేదో చెప్పాలని, సూర లక్ష్మీనర్సమ్మ అర్హతను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదో చెప్పాలని కోర్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు చెప్పారు. బాధితులు ఎంపీడీఓ, గ్రామ, మండల జన్మభూమి కమిటీలు, గ్రామ కార్యదర్శి, డీఆర్‌డీఏ పీడీ, కలెక్టర్, రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ కార్యనిర్వహణ అధికారులను పార్టీలుగా చేర్చారు.
 

మరిన్ని వార్తలు