పోలీసులకు సవాలుగా మారిన రూప్‌కుమార్ ఆచూకీ

3 May, 2015 13:08 IST|Sakshi

 గాలింపు చర్యలు వేగవంతం చేసిన పోలీసులు

తోటపల్లిగూడూరు: భూ వివాదానికి సంబంధించి ఓ వ్యక్తిపై కాల్పులు చేసి పరారీలో ఉన్న వేముల రూప్‌కుమార్‌ను పట్టుకోవడం స్థానిక పోలీసులకు సవాలుగా మారింది. కాల్పులు జరిగిన నెల రోజుల నుంచి పోలీసులు గాలిస్తున్న నిందితుడు రూప్‌కుమార్ జాడ మాత్రం తెలియరాలేదు. సౌత్‌ఆములూరుకు చెందిన బావ, అల్లుడు అయినా వేముల రూప్‌కుమార్, రంగినేని కిరణ్ మధ్య కోడూరు పంచాయతీ పీడీ కండ్రిగలో 4 ఎకరాల భూమికి సంబంధించి కొద్ది కాలంగా భూ వివాదం జరుగుతోంది.

ఈ క్రమంలో గత నెల ఏప్రిల్ 1వ తేదీన పీడీ కండ్రిగలోని ఈ వివాదాస్పద పొలాల్లో వేమల రూప్‌కుమార్ తన వద్దనున్న రివాల్వర్‌తో కిరణ్‌పై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రూప్‌కుమార్ పరారీలో ఉన్నారు. ఘటన జరిగి నెల రోజులు గడిచినా పోలీసులు నిందితుడి ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ఇటీవల వారం రోజుల పాటు స్థానిక ఎసై్స రామకృష్ణ తన సిబ్బందితో కలిసి రూప్‌కుమార్ వ్యాపారాలు సాగించే బెంగళూరులో గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. దీనిపై ఎసై్స రామకృష్ణమాట్లాడుతూ పరారీలో ఉన్న రూప్‌కుమార్ కోసం గాలిస్తున్నామన్నారు. త్వరలోనే నిందితుడుని అరెస్ట్ చేస్తామన్నారు. 

మరిన్ని వార్తలు