నేటి కీలకవార్తలు

23 Jul, 2017 09:45 IST|Sakshi

బెల్ట్‌షాపుల మూసివేత
నేటి నుంచి బెల్ట్‌షాపులు మూసివేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. రోడ్లపై మద్యం సేవిస్తే అరెస్ట్‌ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

టీఎస్‌ ఎంసెట్‌
ఇవాళ్టి నుంచి తెలంగాణ ఎంసెట్‌ తుది విడత కౌన్సిలింగ్‌. ఈ నెల 22న సీట్ల కేటాయింపు.

వాయుగుండం
సోమవారం రాత్రి ఒడిశా తీరం వద్ద వాయుగుండం తీరం దాటింది. దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

డ్రగ్స్‌ కేసు
డ్రగ్స్‌ కేసులో నేటి నుంచి సిట్‌ బృందం సినీ నటులను విచారించనుంది. మంగళవారం దర్శకుడు పూరీ జగన్నాథ్‌ సిట్‌ ఎదుట హాజరుకావాల్సివుంది.

ఆధార్‌
ఆధార్‌ వివరాలు గోప్యమా? కాదా? అనే అంశంపై నేడు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ ప్రారంభించనుంది.

పూర్ణిమ సాయి
ముంబై వెళ్లిన హైదరాబాద్‌ అమ్మాయి పూర్ణిమ సాయిని పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. నేడు మహిళా కమీషన్‌ ఎదుట సాయిని హాజరుపర్చుతారు. కమీషన్‌ ఆదేశాల ప్రకారం తల్లిదండ్రులకు ఆమెను అప్పగించాలా? లేదా? అనే నిర్ణయం తీసుకుంటారు.

మరిన్ని వార్తలు