రాష్ట్ర వ్యాప్తంగా రుణాల మేళాలు

30 Sep, 2019 13:05 IST|Sakshi

సాక్షి, విజయవాడ: స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బ్యాంకర్స్‌కు సూచించిన ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని ఎస్ఎల్బీసీ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ‘ప్రభుత్వం లబ్ధిదారులకు వేసే డబ్బును బాకీ కింద బ్యాంకులు జమకట్టుకోవు. ప్రభుత్వం లబ్ధిదారులకు వేసే డబ్బును వాళ్ళకే ఇచ్చేస్తాము. రైతుల ఖాతాలో ప్రభుత్వం వేసే  వైస్సార్ రైతు భరోసా మొత్తం రైతులకే అందజేస్తాము. 2019-20 సంవత్సరంకు వ్యవసాయ రుణాలను 84 వేల కోట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము. మొదటి మూడు నెలల్లోనే 61 శాతం రుణాలు రైతులకు మంజూరు చేశాము. ఖాతాదారులకు మరింత చేరువయ్యేందుకు అక్టోబర్ 3 తేదీ నుంచి 7 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా రుణాల మేళాలు నిర్వహిస్తున్నాము. బ్యాంకుల విలీనం అనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. విలీనాన్ని వ్యతిరేకించడం మా చేతుల్లో లేదు. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం’ అని వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు