డెంగీ లక్షణాలతో వివాహిత మృతి

8 Nov, 2017 08:21 IST|Sakshi

అనంతపురం జిల్లా / కళ్యాణదుర్గం: పట్టణంలోని శంకరప్పతోట కాలనీకి చెందిన నందిని (23) అనే వివాహిత డెంగీ లక్షణాలతో బెంగళూరులో మంగళవారం తెల్ల వారుజామున మృతి చెందింది. భర్త టి.రవి, తల్లిదండ్రులు తిమ్మయ్య, రాజ్యలక్ష్మిలు తెలిపిన మేరకు... రెండు రోజుల క్రితం నందినికి జ్వరం రావడంతో పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. 

అక్కడ వైద్య పరీక్షలు చేసి డెంగీ లక్షణాలు ఉన్నట్లు చెబుతూ బెంగళూరుకు తీసుకెళ్లాలని సూచించారు. బెంగళూరులోని బ్యాప్‌సిస్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉషశ్రీచరణ్‌ ఆస్పత్రి వద్దకు వెళ్లి నందిని మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. మృతదేహాన్ని కళ్యాణదుర్గానికి తీసుకొచ్చాక మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ బిక్కీ రామలక్ష్మి, ఆమె భర్త బిక్కీ గోవిందప్పలు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
 

మరిన్ని వార్తలు