చాపరాయి బాధితులకు వైఎస్‌ జగన్‌ పరామర్శ

1 Jul, 2017 09:12 IST|Sakshiరాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఆయన శనివారం ఉదయం రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చాపరాయి జర్వపీడితులను పరామర్శించారు. బాధితులు చాలా నీరసంగా ఉండటాన్ని చూసి చలించిపోయారు. రక్తహీనతతో బాధితులు బాధపడుతున్నట్లు డాక్టర్ల ద్వారా తెలుసుకున్న వైఎస్‌ జగన్ వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. 

ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ... ‘ఇప్పటివరకూ వైద్య పోస్టుల భర్తీకి ఎందుకు నోటిఫికేషన్‌ ప్రకటించలేదు?. ఏజెన్సీలో ఎన్నిసార్లు పర్యటించినా మార్పు కనిపించడం లేదు. కనీస సదుపాయాలు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వసతి సదుపాయాలు, రోడ్లు, తాగునీరు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. 108కి డీజిల్‌ కూడా వేయించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే. దీనిపై చంద్రబాబు సమాధానం చెప్పాలి.’ అని అన్నారు.