కాంట్రాక్టు ఉద్యోగుల తరపున పోరాటం

28 Jun, 2014 00:30 IST|Sakshi
కాంట్రాక్టు ఉద్యోగుల తరపున పోరాటం

* వైఎస్ జగన్‌మోన్‌రెడ్డి ప్రకటన
* బాబు సీఎం అయినప్పటినుంచీ ఉద్యోగుల్లో అభద్రతా భావం
 
సాక్షి, పులివెందుల: ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలన్న టీడీపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అంబ్లీలోనే పోరాటం చేస్తానని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి  బాబు వచ్చి జాబు తీసేస్తారన్న అభద్రతా భావం కాంట్రాక్టు ఉద్యోగులలో కనిపిస్తున్నదని అవేదన వ్యక్తం చేశారు.

వైఎస్సార్ జిల్లా పులివెందులలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని ఐటీఐలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, జెఎన్‌టీయూలో పనిచేస్తున్న పలువురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వచ్చి శుక్రవారం ఉదయం ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా తమ ఉద్యోగాలను రెగ్యులైజ్ చేసేందుకు కృషి చేయాలని కోరగా.. వైఎస్ జగన్ పైవిధంగా స్పందించారు. ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా అవసరమైతే న్యాయపరంగా ముందుకెళతామని తెలిపారు.  ఈ సమయంలో వైఎస్ జగన్‌తోపాటు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ దేవనాథరెడ్డి ఉన్నారు.
 

>
మరిన్ని వార్తలు