విశాఖ ఉత్సవ్‌: పార్కులో ప్రవేశం ఫ్రీ

27 Dec, 2019 20:51 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు గన్నవరం నుంచి సీఎం జగన్‌ బయలుదేరుతారు. మధ్యాహ్నం 3.50 నిమిషాల నుంచి 4.20 నిమిషాల వరకు కైలాసగిరి వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం డాక్టర్‌ వైఎస్సార్‌ సెంట్రల్‌ పార్కు వద్ద పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు రామకృష్ణ బీచ్‌లో విశాఖ ఉత్సవ్‌-2019 కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి 7.40కు తన తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటాడు.

విశాఖ ఉత్సవ్‌కు ముస్తాబైన వైఎస్సార్‌ సెంట్రల్‌ పార్క్‌
విశాఖ ఉత్సవ్ సందర్భంగా శని ఆదివారాల్లో వైఎస్సార్ సెంట్రల్ పార్కులో ప్రవేశం ఉచితమని అధికారులు ప్రకటించారు. విశాఖ ఉత్సవ్‌ రెండు రోజుల పాటు జరగనుంది. ఈ సందర్భంగా ఆర్కే బీచ్‌లో సెలబ్రిటీలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే వైఎస్సార్ సెంట్రల్ పార్కులో రూ.60 లక్షల వ్యయంతో ఫ్లవర్ షో ఏర్పాటు చేశారు. దీనికోసం నెదర్ ల్యాండ్, సౌత్ ఆఫ్రికా, థాయిలాండ్ దేశాల నుంచి 20 రకాల ప్రత్యేక పూలను ప్రదర్శనకు తెప్పించారు. ఫ్లవర్ షోలో పది టన్నుల పూలను వినియోగించనున్నారు. ఈ కార్యక్రమాలను విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్డిఏ) కమిషనర్ కోటేశ్వరరావు, చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. విశాఖ  ఉత్సవ్ నేపపథ్యంలో బీచ్‌ రోడ్‌లో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు.

మరిన్ని వార్తలు