యాప్‌కీ కహానీ...

19 Feb, 2018 00:47 IST|Sakshi

భీమ్‌ ఎస్‌బీఐ పే

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సులభ, తక్షణ లావాదేవీల కోసం ‘భీమ్‌ ఎస్‌బీఐ పే’ అనే యాప్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీన్ని ఏ బ్యాంక్‌కు చెందిన కస్టమర్లు అయినా ఉపయోగించొచ్చు. ‘భీమ్‌ ఎస్‌బీఐ పే’ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.  

ప్రత్యేకతలు
యాప్‌ను ఉపయోగించాలంటే.. బ్యాంక్‌ ఖాతాతో అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌ను కలిగి ఉండాలి. అలాగే డెబిట్‌ కార్డు కూడా అవసరమౌతుంది.  
వర్చువల్‌ పేమెంట్‌ అడ్రస్‌ (వీపీఏ).. అకౌంట్‌ నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌.. క్యూఆర్‌ కోడ్‌ వంటి మూడు విధానాల్లో చెల్లింపులు నిర్వహించొచ్చు.  
మీరు కస్టమర్‌ అయితే చెల్లింపులు చేయవచ్చు. అదే వ్యాపారి అయితే పేమెంట్స్‌ను స్వీకరించొచ్చు.  
ఒక ట్రాన్సాక్షన్‌ ద్వారా గరిష్టంగా లక్ష రూపాయలు పంపగలం. అలాగే ఒక రోజులో గరిష్టంగా ఇతరులకు రూ.లక్ష వరకు పంపొచ్చు.  
అదే మీరు వ్యాపారస్తులు అయితే.. ‘ఐ యామ్‌ ఎ మర్చంట్‌’ ఆప్షన్‌ ద్వారా యాప్‌లోకి లాగిన్‌ అవ్వాలి. తర్వాత కస్టమర్ల నుంచి పేమెంట్స్‌ను స్వీకరించొచ్చు.
మల్దిపుల్‌ బ్యాంక్‌ అకౌంట్లను ఉపయోగించొచ్చు. లావాదేవీల వివరాలు పొందొచ్చు. ట్రాన్సాక్షన్లకు సంబంధించి ఏమైనా పొరపాట్లు ఉంటే ఫిర్యాదు చేయవచ్చు.

మరిన్ని వార్తలు