మలాలాతో టెక్‌ దిగ్గజం భాగస్వామ్యం

22 Jan, 2018 13:29 IST|Sakshi

టెక్‌ దిగ్గజం ఆపిల్‌ సంస్థ  బాలికల విద్యకు ప్రోత్సాహం ఇచ్చే దిశగా కీలక నిర్ణయాన్ని  ప్రకటించింది.  ఇందుకోసం నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌ జాయ్‌  నాయకత్వంలోని ది మాలాలా ఫండ్‌కు  భారీ మద్దతు ఇవ్వనున్నట్టు సోమవారం తెలిపింది. బాలికల విద్యకు, సమానత్వానికి విశేషంగా కృషి చేస్తున్న మలాలా ఫండ్‌  సేవలకు విస్తరణకు  ఈ పార్టనర్‌షిప్‌ తోడ్పడనుంది.  అంతేకాదు  మలాలాతో భాగస్వామ్యం కుదుర్చుకున్న తొలి టెక్‌ సంస్థ కూడా ఆపిల్‌నే.  అలాగే మలాలా  ఫండ్‌ లీడర్‌షిప్‌ కౌన్సిల్‌లో ఆపిల్‌ సీఈవో  టిమ్‌ కుక్‌ కూడా చేరనున్నారు.

ప్రతి బాలిక పాఠశాలకు వెళ్లే అవకాశాన్ని  కల్పించాలనే మలాలా యూసఫ్‌ జాయ్‌  నిబద్ధతలో తాము కూడా భాగస్వామ్యులు కావాలని నిర్ణయించామని ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ''మలాలా  బాలికా విద్య, సమానత్వం కోసం  పనిచేస్తున్న ధైర్యం గల న్యాయవాది. మన కాలంలో చాలా ఉత్తేజకరమైన వ్యక్తులలో ఆమె కూడా ఒకరు.  ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిల సాధికారిత కోసం ఆమె చేస్తున్న ముఖ్యమైన పనిలో భాగం కావడం సంతోషంగా ఉంది.  మనల్ని ఏకం చేయడంలో విద్య గొప్ప సమానమైన శక్తి అని నమ్ముతాం'' అని కుక్‌ పేర్కొన్నారు.  2013 నుండి, 12 సంవత్సరాల వరకు ఉచిత, సురక్షితమైన, నాణ్యమైన విద్య ప్రతి అమ్మాయి హక్కుకోసం  ప్రపంచవ్యాప్తంగా ఉన్న , ప్రైవేటు, ప్రభుత్వాలు, ఇతర సంస్థలు భాగస్వామ్యంతో మలాలా ఫండ్ పని చేస్తోంది. 130 మిలియన్ల మందికిపైగా  బాలికలు పాఠశాలలో దూరంగా ఉండడం వారి కృషి ప్రాముఖ్యతను మరింత పెంచిం​దని కుక్‌  వ్యాఖ్యానించారు.

అటు ఆపిల్‌  భాగస్వామ్యంపై మలాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు.  ప్రతి అమ్మాయి తన సొంత భవిష్యత్తును ఎన్నుకోవడమే తన కల అని ఆమె పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు