బీజీఆర్‌ ఎనర్జీ చేతికి ఏపీ పవర్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్రాజెక్టు

5 Jan, 2017 01:05 IST|Sakshi
బీజీఆర్‌ ఎనర్జీ చేతికి ఏపీ పవర్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్రాజెక్టు

రూ.650 కోట్ల ఆర్డర్లు
చెన్నై: ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ (ఈపీసీ)    దిగ్గజం బీజీఆర్‌ ఎనర్జీ, వాటర్‌ ట్రీట్‌మెంట్‌ వ్యాపారంలోకి ప్రవేశించింది. రూ.650 కోట్ల విలువైన రెండు ఆర్డర్లను సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నంలో ఉన్న పవర్‌  డిస్ట్రిబ్యూషన్‌  కంపెనీ నుంచి రూ.210 కోట్ల ఆర్డర్‌ను సాధించామని బీజీఆర్‌ ఎనర్జీ తెలిపింది. ఈ ఆర్డర్‌లో భాగంగా 800 మెగావాట్ల మూడు వాటర్‌  ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సి  ఉంటుందని వివరించింది.

ఇక చెన్నై మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజ్‌ బోర్డ్‌ నుంచి రూ.440 కోట్ల ఆర్డర్‌ను పొందామని పేర్కొంది. ఈ ఆర్డర్‌లో భాగంగా చెన్నై సమీపంలోని కొడంగైయ్యూర్‌లో రోజుకు 45 మిలియన్‌ లీటర్ల సామర్థ్యమున్న టెర్షియరీ ట్రీట్‌మెంట్‌  రివర్స్‌ ఆస్మోసిస్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని వివరించింది. ఈ రెండు ఆర్డర్లతో తమ ఆర్డర్ల బుక్‌ విలువ రూ.10,425 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఈ ఆర్డర్ల నేపథ్యంలో బీఎస్‌ఈలో బీజీఆర్‌ ఎనర్జీ షేర్‌ 7 శాతం వృద్ధితో రూ.125కు ఎగసింది.

మరిన్ని వార్తలు