ఉదయనిధి స్టాలిన్‌ చేతికి ‘సలార్‌’... తమిళ్‌లో భారీ స్తాయి

12 Nov, 2023 09:11 IST|Sakshi

తమిళసినిమా: ఇప్పుడు ప్రపంచ సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం సలార్‌. ఇందుకు కారణాలు చాలానే ఉన్నా యి. ఫస్ట్‌ హైలైట్‌ నటుడు ప్రభాస్‌. సెకండ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. థర్డ్‌ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలె ఫిలింస్‌. ఇంకా మలయాళ స్టార్‌ పృధ్వీరాజ్, సంచలన నటి శృతిహాసన్‌ ఇంకా అదనవు హంగులు చాలానే ఉన్నాయి. కేజీఎఫ్‌ పార్ట్‌ 1, 2 వంటి సంచలన విజయాలను సాధించిన సంస్థ హోంబలె నిర్మాత, దర్శకుడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం సలార్‌. నటుడు ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ఇది.

చిత్రం టీజర్‌ ఇప్పటికే విడుదలైన సలార్‌పై అంచనాలను పెంచింది. చిత్ర విడుదలను నిర్మాత అధికారికంగా ప్రకటించేశారు. డిసెంబరు 22న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య తెర పైకి రానుంది. ఈ చిత్రాన్ని కర్ణాటకలో హోంబలె సంస్థ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక తమిళనాడు విడుదల  హక్కులను రాష్ట్ర క్రీడా శాఖామంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ సొంతం చేసుకుంది. దీని గురించి ఆ సంస్థ ఒక పోస్టర్‌ ను విడుదల చేసి అధికారికంగా ప్రకటించారు. దీంతో తమిళనాడులోనూ సలార్‌ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

మరిన్ని వార్తలు