రూ.39కే అపరిమిత కాల్స్‌

9 May, 2018 19:10 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. రూ.39కే అపరిమిత కాలింగ్‌ ఆఫర్‌ను అందించనున్నట్టు తెలిపింది. ఈ కొత్త ఆఫర్‌ కింద అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌తో పాటు నేషనల్‌ రోమింగ్‌ను తన ప్రీపెయిడ్‌ కస్టమర్లకు అందించనున్నట్టు పేర్కొంది. అదేవిధంగా రిలయన్స్‌ జియో తన జియోఫైబర్‌ను త్వరలోనే కమర్షియల్‌గా లాంచ్‌ చేయనున్న నేపథ్యంలో దాని కంటే ముందస్తుగా బీఎస్‌ఎన్‌ఎల్‌ తన ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఆఫర్స్‌ను సమీక్షించింది. సమీక్షించిన కొత్త ఆఫర్స్‌ కింద తన మూడు ఎఫ్‌టీటీహెచ్‌ ప్లాన్లు రూ.1045, రూ.1395, రూ.1895పై ఎఫ్‌యూపీ డేటాను రెండింతలు పెంచనున్నట్టు ప్రకటించింది. 

రూ.1045 ప్లాన్‌పై ప్రస్తుతం 100జీబీ ఎఫ్‌యూపీ డేటాను, 30ఎంబీపీఎస్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌లో అందించనుంది. అంతకముందు ఈ ప్లాన్‌పై 50జీబీ డేటానే ఆఫర్‌ చేసేది. అదేవిధంగా రూ.1395 ప్లాన్‌పై 150జీబీ డేటాను 40ఎంబీపీఎస్‌ బ్యాండ్‌విడ్త్‌ స్పీడులో ఆఫర్‌ చేయనుంది. రూ.1895 ప్లాన్‌పై 200జీబీ డేటాను, 50ఎంబీపీఎస్‌ బ్యాండ్‌విడ్త్‌ స్పీడులో అందించనుంది. అంతకముందు ఈ ప్లాన్‌పై 100జీబీ డేటానే ఆఫర్‌ చేసేది. ఈ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ ప్రయోజనాలను కేవలం కేరళ సర్కిల్‌ వారికే ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌ తీసుకొచ్చిన ఈ రూ.39 రీఛార్జ్‌ ప్లాన్‌ కూడా ఢిల్లీ, ముంబై మినహా మిగతా అన్ని ప్రాంతాలకు లభ్యమవుతోంది. అపరిమిత వాయిస్‌ కాలింగ్‌తో పాటు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, ఉచితంగా పర్సనలైజ్డ్‌ రింగ్‌బ్యాక్‌ టూన్లను ఆఫర్‌ చేయనుంది. అయితే ఈ ప్లాన్‌ కింద డేటా అందించకపోవడం గమనార్హం. మరోవైపు ఈ ప్లాన్‌ వాలిడిటీ కూడా 10 రోజులు మాత్రమే. 

మరిన్ని వార్తలు