ఇంటెల్‌పై సీసీఐ విచారణ

13 Nov, 2018 00:41 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత మార్కెట్లో ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలకు సంబంధించి చిప్‌ తయారీ దిగ్గజం ఇంటెల్‌పై కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) విచారణకు ఆదేశించింది. బెంగళూరుకు చెందిన వేలాంకని ఎలక్ట్రానిక్స్‌ ఫిర్యాదుతో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

వేలాంకని సంస్థ.. దేశీయంగా ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల డిజైనింగ్, తయారీ కార్యకలాపాలు సాగిస్తోంది. వీటికి కీలకమైన ప్రాసెసర్స్, చిప్‌సెట్స్, మదర్‌బోర్డు/సర్వర్‌ బోర్డులు మొదలైన వాటిని ఇంటెల్‌ తయారు చేస్తోంది. అయితే, ప్రధానమైన రిఫరెన్స్‌ డిజైన్‌ ఫైల్స్‌ను ఇచ్చేందుకు ఇంటెల్‌ నిరాకరించిందని, తద్వారా సర్వర్‌ బోర్డులను రూపొందించకుండా తమను నిరోధించినట్లయిందని వేలాంకని ఆరోపించింది. ఫలితంగా మార్కెట్లో తమ అవకాశాలను దెబ్బతీసినట్లయిందని పేర్కొంది.

మరిన్ని వార్తలు