ఆటో.. రీస్టార్ట్‌..

12 May, 2020 01:08 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కట్టడికి ఉద్దేశించిన లాక్‌డౌన్‌ దెబ్బతో మూతబడిన వ్యాపార కార్యకలాపాలను ఆటోమొబైల్‌ సంస్థలు క్రమంగా పునఃప్రారంభిస్తున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, ఫోక్స్‌వ్యాగన్, మహీంద్రా, హోండా కార్స్‌ మొదలైన వాటి బాటలోనే మరికొన్ని సంస్థలు కూడా షోరూమ్‌లు తెరవడంతో పాటు ఆన్‌లైన్‌లో అమ్మకాలు చేపడుతున్నాయి. తాజాగా ఆడి ఇండియా, రెనో తదితర కంపెనీలు ఈ జాబితాలో చేరాయి.

ఆడి ఇండియా: కస్టమర్లు ఇంటి నుంచి కదలకుండానే వాహన కొనుగోలు, సర్వీసింగ్‌ వంటి సేవలు పొందేందుకు వీలుగా ఆన్‌లైన్‌ సేల్స్, సర్వీస్‌ కార్యకలాపాలు ప్రారంభించింది.  

రెనో: ఫ్రాన్స్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం రెనో భారత్‌లో తమ కార్పొరేట్‌ ఆఫీస్‌ను, కొన్ని డీలర్‌షిప్‌లు.. సర్వీస్‌ సెంటర్లను పునఃప్రారంభించింది. కొత్త భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా 194 షోరూమ్స్, వర్క్‌షాప్‌లను తిరిగి
తెరిచినట్లు రెనో ఇండియా కార్యకలాపాల విభాగం సీఈవో వెంకట్రామ్‌ మామిళ్లపల్లె తెలిపారు.

బజాజ్‌ ఆటో: మూడో ఫేజ్‌ లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో డీలర్‌షిప్‌లు, సర్వీస్‌ సెంటర్లను మే 4 నుంచి క్రమంగా తెరుస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.

హీరో: పంజాబ్, బీహార్‌లోని ప్లాంట్లను పునఃప్రారంభించినట్లు హీరో సైకిల్స్‌ వెల్లడించింది. మొత్తం సామర్థ్యంలో 30 శాతం మేర ఉత్పత్తి మొదలుపెట్టినట్లు వివరించింది. అలాగే స్వల్ప సిబ్బందితో కార్పొరేట్‌ ఆఫీస్‌ను కూడా తెరిచినట్లు సీఎండీ పంకజ్‌ ఎం ముంజల్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు