పెట్టుబడులకు పునరుత్తేజం కావాలి..

20 May, 2014 00:21 IST|Sakshi
పెట్టుబడులకు పునరుత్తేజం కావాలి..

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలోని కొత్త సర్కారు పారిశ్రామిక రంగానికి మరింత చేదోడుగా నిలవాలని కార్పొరేట్లు కోరుతున్నారు. సోమవారమిక్కడ ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్దార్థ బిర్లా మాట్లాడుతూ... పాత ఒప్పందాలకూ వర్తించేలా తీసుకొచ్చిన పన్ను చట్టాల సవరణ, ఇతరత్రా  మల్టీబ్రాండ్ రిటైల్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) రావాలన్నదే తమ అభిప్రాయమని కూడా ఆయన పేర్కొన్నారు.

గతంలో ఈ ప్రతిపాదనలకు బీజేపీ వ్యతిరేకత వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం దీనిపై మీ వైఖరేంటన్న ప్రశ్నకు బిర్లా ఈ విధంగా స్పందించారు. కాగా, కొత్త ప్రభుత్వానికి ఫిక్కీ సూచించిన అజెండాలో ఇంకా... 2015కల్లా వస్తు-సేవల పన్ను(జీఎస్‌టీ) అమలు, జాతీయ ఉపాధి హామీ పథకంలో సమూల మార్పులు, సబ్సిడీలపై సమీక్ష, ద్రవ్యోల్బణం కట్టడికి పటిష్ట చర్యలు, డీటీసీ)లో మార్పుచేర్పులు వంటి పలు అంశాలు ఉన్నాయి.

 సీఐఐదీ ఇదే మాట...
 పెట్టుబడులకు ప్రోత్సాహంతోపాటు ఎగుమతులకు చేయూత, ఆర్థిక స్థిరీకరణ, వ్యాపారానికి సానుకూల పరిస్థితులు, పొదుపు పెంచేలా చర్యలు, వృద్ధికి ఆసరా, ధరలకు కళ్లెం వేయడం వంటి అంశాలపై మోడీ నేతృత్వంలోని కొత్త సర్కారు దృష్టిపెట్టాలని భారతీయ పరిశ్రమ సమాఖ్య(సీఐఐ) పేర్కొంది.  ఈ మేరకు సీఐఐ అధ్యక్షుడు అజయ్ శ్రీరామ్ ఒక అజెండా విడుదల చేశారు. ముందుగా 6.5% జీడీపీ వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకోవాలని.. 2016-17లో దీన్ని 8.5 శాతానికి పెంచడానికి కృషిచేయాలని  అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలతో సమన్వయంతో కేంద్రం-  పారిశ్రామిక  వృద్ధి, ద్రవ్యోల్బణం కట్టడిపై దృష్టి పెట్టాలన్నారు.

>
మరిన్ని వార్తలు