ఇక్కడి ఆస్తులకు జియో ట్యాగింగ్‌ తప్పనిసరి! ముందే చేయించుకుంటే ఆఫర్‌..

24 Dec, 2023 15:56 IST|Sakshi

దేశ రాజధాని నగరం ఢిల్లీ దేశంలోని అతిపెద్ద, అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో ఒకటి. స్థానికులకే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన చాలా మందికి ఇక్కడ ఆస్తులు ఉన్నాయి. వీటికి సంబంధించి ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న ఆస్తులకు జియో ట్యాగింగ్ తప్పనిసరి అని ప్రకటించింది.

ముందే చేయించుకుంటే రాయితీ
ఎంసీడీ పరిధిలోని ఆస్తులకు జియో ట్యాగింగ్ చేయడం ద్వారా ఆస్తి పన్నుల పూర్తి, కచ్చితమైన సమాచారం లభిస్తుందని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ భావిస్తోంది. మేరకు అన్ని ప్రాపర్టీలకు జియో​ట్యాగింగ్‌ తప్పినిసరి అని వాటి యజమానులకు స్పష్టం చేసింది.  అంతేకాకుండా 2024 జనవరి 31 లోపు జియోట్యాగింగ్‌ చేయించుకున్న వారికి ఆస్తిపన్నుపై 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది.

అయితే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రాపర్టీ యజమానులు వ్యతిరేకిస్తున్నారు. ఇంత పెద్ద ప్రకటన చేసే ముందు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎవరినీ సంప్రదించుకుండా, యజమానుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు