ఫ్లోర్‌ టెస్ట్‌: స్టాక్‌మార్కెట్లో అమ్మకాలు

18 May, 2018 14:18 IST|Sakshi

సాక్షి, ముంబై:  కర్ణాటక రాజకీయాలు వాడి వేడిగా మారుతున్న తరుణంలో  దేశీయ మార్కెట్లలో కూడా హీట్‌ పెరిగింది. శనివారం సాయంత్రి ఫ్లోర్‌ టెస్ట్‌ ఖాయం కావడంతో  మార్కెట్లో  అమ్మకాలు ఊపందుకున్నాయి.   ఆరంభంనుంచి   ఒత్తిడిని ఎదుర్కొంటున్న సెన్సెక్స్‌   200 పాయింట్లకు పైగా కోల్పోయింది.  సెన్సెక్స్‌ 232 పాయింట్లు పతనమై 34 916 వద్ద,  నిఫ్టీ 70 పాయింట్ల నష్టంతో 10,612 వద్ద ట్రేడవుతోంది. కీలక సూచీ సెన్సెక్స్‌ 35,000 పాయింట్ల మార్క్‌ను, నిఫ్టీ 10650 స్థాయిని కోల్పోయాయి.   దాదాపు అన్ని రంగాల్లోనూ  నష్టాలే.

ప్రధానంగా ఫార్మా, మెటల్‌, బ్యాంకింగ్‌, ఆటో  షేర్లు కుదేలయ్యాయి. టాటా మోటార్స్‌, అదానీ పోర్ట్స్‌, విప్రో, ఐసీఐసీఐ, సన్‌ ఫార్మా, అల్ట్రాటెక్‌, వేదాంతా, సిప్లా, ఐబీ హౌసింగ్, లుపిన్‌ నష్టపోతుండగా,  బజాజ్‌ ఫైనాన్స్‌, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఆటో, ఐటీసీ, హెచ్‌యూఎల్‌, కొటక్‌ బ్యాంక్‌ యూపీఎల్‌, ఓఎన్‌జీసీ, ఇండస్‌ఇండ్, ఐషర్‌ స్వల్పంగా లాభపడుతున్నాయి. మరోవైపు  దామాని డీమార్ట్‌లో కొంత వాటా అమ్మకం వార్తలతో డీమార్ట్‌  కౌంటర్‌లో అమ్మకాలకు తెరలేచింది.

>
మరిన్ని వార్తలు