ఐడీబీఐ బ్యాంక్‌

15 Aug, 2019 05:05 IST|Sakshi

నష్టాలు రూ.3,801 కోట్లు

రూ.5,924 కోట్లకు తగ్గిన మొత్తం ఆదాయం  

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌ నికర నష్టాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో మరింతగా పెరిగాయి. గత క్యూ1లో రూ.2,410 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ1లో రూ.3,801 కోట్లకు పెరిగాయని ఐడీబీఐ బ్యాంక్‌ తెలిపింది. మొండి బకాయిలు తగ్గినా,  వాటికి కేటాయింపులు పెరగడంతో నికర నష్టాలు కూడా పెరిగాయని వివరించింది. మొత్తం ఆదాయం రూ.6,403 కోట్ల నుంచి రూ.5,924 కోట్లకు తగ్గిందని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం రూ.1,639 కోట్ల నుంచి రూ.1,458 కోట్లకు తగ్గిందని తెలిపింది.  

తగ్గిన మొండి బకాయిలు....
మొండి బకాయిలు తగ్గాయని  బ్యాంక్‌ వెల్లడించింది. గత క్యూ1లో 30.78%గా ఉన్న మొండి బకీలు ఈ క్యూ1లో 29.12%కి తగ్గాయి. విలువ పరంగా, స్థూల మొండి బకాయిలు రూ.57,807 కోట్ల నుంచి రూ.51,658 కోట్లకు తగ్గాయని తెలిపింది. నికర మొండి బకాయిలు 18.76% నుంచి 8.02%కి చేరినట్లు పేర్కొంది.  

పెరిగిన కేటాయింపులు.....
గత క్యూ1లో రూ.4,603 కోట్లుగా ఉన్న మొండి బకాయిలకు కేటాయింపులు ఈ క్యూ1లో రూ.7,009 కోట్లకు పెరిగాయని ఐడీబీఐ బ్యాంక్‌ తెలిపింది. మొండి బకాయిలు, ఇతరాలకు కూడా కలుపుకొని మొత్తం కేటాయింపులు రూ.5,236 కోట్ల నుంచి రూ.6,332 కోట్లకు చేరాయని పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో ఈ బ్యాంక్‌లో 51% వాటాను ఎల్‌ఐసీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.  
ఇక ఆర్తిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఐడీబీఐ బ్యాంక్‌ షేర్‌ 1.3 శాతం లాభంతో రూ. 27.15 వద్ద ముగిసింది.  

మరిన్ని వార్తలు