ఏడాదిలోగా ఐడియా ట్యాబ్లెట్ పీసీలు

12 Mar, 2014 01:05 IST|Sakshi
ఏడాదిలోగా ఐడియా ట్యాబ్లెట్ పీసీలు

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ ఐడియా సెల్యులార్ ట్యాబ్లెట్ పీసీలను ఆవిష్కరించనుంది. మార్కెట్ తీరుతెన్నులను పరిశీలిస్తున్నామని, ఏడాదిలోగా వీటిని తీసుకొస్తామని సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశి శంకర్ మంగళవారమిక్కడ తెలిపారు. రాష్ట్ర మార్కెట్లో 3జీ స్మార్ట్‌ఫోన్ అల్ట్రా-2 ఆవిష్కరించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సీవోవో బి.రామకృష్ణతో కలిసి మీడియాతో మాట్లాడారు. మంచి ఫీచర్లతో, అందుబాటు ధరలో ట్యాబ్లెట్ పీసీలను ప్రవేశపెడతామని చెప్పారు.

ఏటా 5-6 మోడళ్లు విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నా రు. 6.5 లక్షల ఫోన్లను విక్రయించామన్నారు. ప్రస్తుతం డేటా నుంచి వస్తున్న ఆదాయం 10% ఉంది. మూడేళ్లలో ఇది 25%కి చేరుతుందని అంచనా వేశారు. అల్ట్రా-2 విడుదల చేయడం ద్వారా కంపెనీ 5.5 అంగుళాల స్క్రీన్ విభాగంలోకి ప్రవేశించింది. 1.3 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఆన్‌డ్రాయిడ్ జెల్లీ బీన్, 1 జీబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ మెమరీ, 8 ఎంపీ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లున్నాయి. ధర రూ.12,500. అలాగే 1 గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌తో ఐడియా ఐడీ-1000 మోడల్‌ను రూ.5,400 ధరలో ప్రవేశపెట్టింది.

మరిన్ని వార్తలు