కరోనా : టాప్-10 నుంచి స్టాక్‌ మార్కెట్ ఔట్

25 Apr, 2020 12:53 IST|Sakshi

 మార్కెట్  క్యాప్ పరంగా టాప్ 10 నుంచి వైదొలగిన భారతీయ స్టాక్ మార్కెట్ 

 భారీ నష్టాలతో 2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ క్లబ్‌ నుంచి ఔట్

సాక్షి, ముంబై : కోవిడ్-19 మహమ్మారి పుణ్యమా అని భారతీయ స్టాక్ మార్కెట్ టాప్-10 స్టాక్ మార్కెట్ల జాబితా నుంచి పడిపోయింది. కరోనా వైరస్,  లాక్ డౌన్  ఆందోళన నేపథ్యంలో భారతీయ ఈక్విటీ మార్కెట్ భారీ పతనాన్ని నమోదు చేసింది. కీలక సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ  పతనంతో లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. దీంతో  గ్లోబల్ ఈక్విటీ మార్కెట్ టాప్ 10 జాబితానుంచి, 2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ క్లబ్‌ నుంచి తప్పుకుంది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి రికార్డు కనిష్టానికి చేరుకుంది.

బ్లూమ్బెర్గ్ డేటా ప్రకారం ఈక్విటీ మార్కెట్ల  మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్, సంవత్సరం ప్రారంభం నుండి డాలర్ పరంగా 27.31శాతం పడిపోయింది. 1.57 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ కాప్ తో  11 వ స్థానానికి పడిపోయింది. 2019 జనవరిలో  2.08 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ ఏడవ స్థానాన్ని సంపాదించుకుంది. కాగా గత జనవరిలో 2.16 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో భారతదేశం 10 వ స్థానానికి చేరింది. తాజాగా  కోవిడ్ -19 విలయంతో 10 స్థానాన్ని కూడా కోల్పోయింది.  (ప్రపంచంలోనే టాప్ సుందర్ పిచాయ్)

బెంచ్మార్క్ సూచికలు అతిపెద్ద వన్డే క్షీణతను నమోదు చేసిన మార్చి 23 న భారత్ టాప్ 10 జాబితాలో పడిపోయింది, ఈ రోజు భారతదేశం మొత్తం మార్కెట్ క్యాప్ డాలర్ పరంగా 31 1.31 ట్రిలియన్లు . రూపాయి పరంగా  రూ.101.87 ట్రిలియన్లు. అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్  రూ. 21.74 శాత తగ్గి 121.73 ట్రిలియన్  చేరుకుంది. ఈ ఏడాది ఇప్పటివరకు  రూ. 155.54 ట్రిలియన్లు. (‘ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌’ షాక్‌)

సిఎల్‌ఎస్‌ఎ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, గత 30 ఏళ్లలో భారతీయ మార్కెట్లలో 40శాతం నమోదు చేయడం ఇది ఐదవ సారి. భారతదేశంలో రికార్డు స్థాయిలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. భారతదేశం బెంచ్మార్క్ఇండెక్స్ ఈ సంవత్సరం ఇప్పటివరకు 29.10శాతం(డాలర్ల పరంగా) కోల్పోయింది ఈ సంవత్సరం ప్రారంభంనుండి 24 శాతం కుప్ప కూలడంతో మొత్తం మార్కెట్ క్యాప్ నష్టానికి దారితీసింది. 2019 లో 11.91 శాతం  పెరిగింది. మొత్తం ప్రపంచ మార్కెట్ క్యాప్‌లో భారతదేశం2.18శాతంఉండగా, 2019 ప్రారంభంలో ఇది 2.97శాతం గా ఉంది. 2020లో ఇప్పటివరకు, ప్రపంచ స్టాక్ మార్కెట్లు మొత్తం విలువలో 17.15 శాతం క్షీణించాయి. 86.99 ట్రిలియన్ నుండి  72.07 ట్రిలియన్లకు చేరాయి. అయితే కోవిడ్ -19 కు కేంద్రంగా ఉన్న చైనా   2020లో ఇప్పటివరకు మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.36 శాతం  లేదా 7.24 ట్రిలియన్ల డాలర్లు నష్టపోయింది. 29.34 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో  అమెరికా తన టాప్ స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. 2020లో  30.09 శాతం  కోల్పోయిన యుకె,  2.44 ట్రిలియన్ డాలర్ల (మార్కెట్ క్యాప్)తో  ఐదవ స్థానంలో ఉంది.  (కరోనా డ్రగ్ వైఫల్యం, రూపాయి బలహీనం)

రూపాయి పతనం : ఆసియాలో భారతీయ కరెన్సీ రూపాయి భారీగా పతనమైంది. వరుస రికార్డు కనిష్టాలతో ఈ ఏడాది ఇప్పటివరకు డాలర్‌తో పోలిస్తే 6.64 శాతం బలహీనపడింది. ఏప్రిల్ మాసంలో భారత కరెన్సీ  76.92 కనిష్ట స్థాయిని తాకింది.  ఇదే  సమయంలో  డాలర్  4.14 శాతం లాభపడడం గమనార్హం. (కరోనా: ప్రమాదంలో 29 లక్షలకు పైగా ఉద్యోగాలు)

అంబిట్ క్యాపిటల్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ల ఉద్దాన పతనాలు సాధారణమే అనేది 100 సంవత్సరాల చరిత్ర చెబుతోంది. దశాబ్దంలో ఏదో ఒక సంఘటన 35 శాతం పతనానికి దారి తీస్తుంది. నష్టాల్లో మార్కెట్లో పెట్టుబడిదారుల సెంటిమెంటు దెబ్బతింటుంది. ఆందోళనతో అమ్మకాలకు పాల్పడతారు. ఫలితంగా ఆర్థిక మాంద్యం, ఉద్యోగ మాంద్యం, వేతనాల కోతలు అనివార్యమవుతాయి. అయితే ఇలాంటి సంక్షోభాలనుంచి భారత మార్కెట్లు అమెరికా లేదా ఇతర అభివృద్ధి చెందిన మార్కెట్ల కంటే వేగంగా కోలుకుంటాయి. సగటున 12-14 నెలల్లో కోలుకుంటాయి. సగటున 16 -18 నెలల్లో గరిష్టాలను తాకుతాయి. భారతీయ మార్కెట్లు ఎంత వేగంగా పడిపోతాయో, అంతే వేగంగా పుంజు కుంటాయని అంచనా. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు