వి-క్రాస్ బుకింగ్స్ ప్రారంభించిన ఇసుజు

10 May, 2016 01:42 IST|Sakshi
వి-క్రాస్ బుకింగ్స్ ప్రారంభించిన ఇసుజు

న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన దిగ్గజ వాహన కంపెనీ ‘ఇసుజు మోటార్స్’ తన యుటిలిటీ వెహికల్ ‘డి-మ్యాక్స్ వి-క్రాస్’ బుకింగ్స్‌ను సోమవారం ప్రారంభించింది. దీని ధర రూ.12.49 లక్షలుగా (ఎక్స్ షోరూమ్ చెన్నై) ఉంది. వాహన డెలివరీ జూలై నుంచి ఉంటుందని కంపెనీ పేర్కొంది. అడ్వెంచర్, స్టైల్, యుటిలిటీ ప్రత్యేకతలను కోరుకుంటున్న వారికి త మ వెహికల్ సరిగ్గా సరిపోతుందని వివరించింది. ‘వి-క్రాస్’లో సీఆర్‌డీఐ ఇంజిన్, 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్,  వంటి ప్రత్యేకతలు ఉన్నాయని పేర్కొంది.

మరిన్ని వార్తలు