దేశం మొత్తం ఇవే స్కాములు, ‘పిగ్‌ బుచరింగ్’పై నితిన్‌ కామత్!

15 Nov, 2023 10:45 IST|Sakshi

ప్రముఖ ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ సంస్థ జిరోదా వ్యవస్థాపకుడు, సీఈఓ నితిన్‌ కామత్‌ సోషల్‌ మీడియా యూజర్లకు హెచ్చరికలు జారీ చేశారు.‘పిగ్‌ బుచరింగ్‌’ స్కామ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ పిగ్‌ బుచరింగ్‌ స్కామ్‌లు వందల నుంచి కోట్లలో జరుగుతున్నాయని ఎక్స్‌ (ట్వీట్టర్‌)లో పోస్ట్‌ చేశారు. 

పిగ్‌ బుచరింగ్‌ అంటే?   
పిగ్‌ బుచరింగ్‌ అనేది ఓ సైబర్‌ స్కామ్‌. ఆన్‌లైన్‌లో ఫేక్‌ మెసేజ్‌లు, యూజర్లను నమ్మించేలా ఫేక్‌ పేమెంట్‌లతో బురిడి కొట్టించి సొమ్ము చేసుకునే లాంటింది. ఈ కుంబకోణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కామత్‌ పలు జాగ్రత్తలు చెప్పారు. 

పిగ్‌ బుచర్స్‌ ఫేక్‌ సోషల్‌ మీడియా అకౌంట్లను క్రియేట్‌ చేసుకుంటారు. ఆన్‌లైన్‌లో యాక్టీవ్‌గా ఉండే యూజర్ల నమ్మకాన్ని గెలుచుకునేలా ఆ ఫేక్‌ ప్రొఫైల్‌తో ప్రేమ, ఫ్రెండ్‌షిప్‌ పేరుతో దగ్గరవుతారు. ఒక్కసారి యూజర్లు పిగ్‌ బుచర్స్‌ను నమ్మితే చాలు. ఇక వాళ్ల పని మొదలు పెడతారు.ఫేక్‌ జాబ్స్‌, అధికమొత్తంలో డబ్బులు సంపాదించుకునే అవకాశాల్ని కల్పిస్తున్నామంటూ ఆశచూపిస్తారు. ఆపై యూజర్ల అకౌంట్లలో ఉన్న మొత్తాన్ని దోచుకుంటారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని కామత్‌ చెప్పారు. ఇలాంటి వాటిని ఎవరూ ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని సలహా ఇచ్చారు. 

ఈ స్కాములు ఏ స్థాయిలో ఉంటాయంటే?
ఈ తరహా సైబర్‌ స్కాములు ఏ స్థాయిలో ఉంటాయంటే.. సైబర్‌ నేరస్తుల చేతుల్లో మోసపోతున్నామని తెలియకుండా.. మరో స్కామ్‌లో ఇరుక్కుపోతారని కామత్‌ తన పోస్ట్‌లో చెప్పారు.  ఎక్కువ మంది బాధితులు అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాల ఉన్నాయంటూ ఫేక్‌ కంపెనీల నుంచి వచ్చే కాల్స్‌ను నమ్మి మోసపోతున్నారని తెలిపారు.  

అంతేకాదు యూజర్లను నమ్మించేలా జెండర్‌ మార్చి మారుపేర్లతో సోషల్‌ మీడియా అకౌంట్లను ఉపయోగిస్తారని జిరోధా సీఈఓ చెప్పారు. మయన్మార్‌ కేంద్రంగా ఏర్పాటు చేసిన ఓ ఫేక్‌ కంపెనీ చేసిన పిగ్‌ బుచర్స్‌ స్కామ్‌లో 16 మంది భారతీయులు మోసపోయినట్లు వెలుగులోకి వచ్చిన కథనాల్ని సైతం షేర్‌ చేశారు.  

పిగ్‌ బుచర్స్‌తో అప్రమత్తం
 
వాట్సప్‌, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, డేటింగ్ యాప్‌లలో అనుమానాస్పద మెసేజ్‌లకు రిప్లయి ఇవ్వకూడదు 

ఎవరైనా మిమ్మల్ని కొత్త యాప్‌లను డౌన్‌లోడ్ చేయమని లేదా లింక్‌లను క్లిక్‌ చేయమని అడిగితే వెంటనే వాటిని డిలీట్‌ చేయండి, లేదంటే నెంబర్‌ను బ్లాక్‌ చేయండి. 

 స్కామర్లు యూజర్ల ఆశలు, భయాలు, కలలు, దురాశ వంటి భావోద్వేగాలతో ఆడుకుంటారు. ఎప్పుడూ తొందరపడి స్పందించొద్దు

 భయపడవద్దు. తొందర పడి తీసుకునే నిర్ణయాలతో ఇబ్బందులకు గురవుతుంటారు.  

అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, లాయర్లను సంప్రదించండి.  

ఎవరైనా ఉద్యోగం లేదా అధిక మొత్తంలో డబ్బులు సంపాదించుకునే అవకాశాలున్నాయని, ఇందుకోసం డబ్బులు కట్టాలని అడిగితే అది మోసంగా భావించాలి.  
 
ఆధార్, పాస్‌పోర్ట్ వంటి వ్యక్తిగత సమాచారం,  బ్యాంక్ వివరాలు, పెట్టుబడి వివరాలు ఇతర ఆర్ధిక పరమైన విషయాల్ని ఎవరితో పంచుకోవద్దని జిరోధా సీఈవో నిఖిల్‌ కామ్‌ యూజర్లను కోరారు. 

మరిన్ని వార్తలు