షేర్ల బైబ్యాక్‌కు నాల్కో బోర్డ్‌ ఆమోదం

13 Oct, 2018 01:05 IST|Sakshi

విలువ రూ.505 కోట్లు;ధర రూ.75

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ నేషనల్‌ అల్యూమినియమ్‌ కంపెనీ(నాల్కో) రూ.504.8 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ చేయనున్నది. ఈ షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనకు శుక్రవారం జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని నాల్కో పేర్కొంది.

షేర్ల బైబ్యాక్‌లో భాగంగా ఒక్కో షేర్‌ ధరను రూ.75 చొప్పున 6,73,11,386 షేర్లకు మించకుండా బైబ్యాక్‌ చేస్తామని వివరించింది. కాగా ఈ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఐదు రెట్లు పెరిగి రూ.687 కోట్లకు పెరి గింది. బైబ్యాక్‌కు వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో నాల్కో షేర్‌ స్వల్పంగా లాభపడి రూ.66.95 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు