ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లో ‘ఎమోజీ’ పిన్ కోడ్‌లు

16 Jun, 2015 01:08 IST|Sakshi
ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లో ‘ఎమోజీ’ పిన్ కోడ్‌లు

లండన్: ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీల్లో నాలుగు అంకెల పిన్ కోడ్ స్థానంలో ‘ఎమోజీ’లను ఆవిష్కరించింది లండన్‌కి చెందిన బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ ఇంటెలిజెంట్ ఎన్విరాన్‌మెంట్స్. పాతబడిన నంబర్ల పద్ధతికి బదులుగా సరదాగా ఉండే ఎమోజీలను పాస్ కోడ్‌లుగా  వాడటమనేది 15-25 ఏళ్ల యూజర్లకు ఆకర్షణీయంగా ఉంటుందని సంస్థ ఎండీ డేవిడ్ వెబర్ చెప్పారు. 0-10 దాకానే ఉండే అంకెలతో పోలిస్తే 44 ఎమోజీల కాంబినేషన్లు మరింత సురక్షితంగా ఉంటాయని  వివరించారు. ఎలక్ట్రానిక్ మాధ్యమంలో సమాచార మార్పిడి కోసం... వివిధ రకాల హావభావాలతో కూడిన చిత్రాలను ఎమోజీలుగా వ్యవహరిస్తారు.

మరిన్ని వార్తలు