దక్షిణాదిన ఓరియంట్‌ ఎలక్ట్రిక్‌ ప్లాంటు!

17 Jan, 2020 06:18 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ ఓరియంట్‌ ఎలక్ట్రిక్‌ దక్షిణాదిన ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న అయిదు ప్లాంట్లలో వినియోగం పూర్తి స్థాయికి చేరుకున్నందున కొత్త ఫెసిలిటీ అవసరమని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అతుల్‌ జైన్‌  వెల్లడించారు. ఎలిగంజా సిరీస్‌ ఉత్పత్తులను ఇక్కడ ప్రవేశపెట్టిన సందర్భంగా గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రతిపాదిత ప్లాంటును ఎక్కడ, ఎంత మొత్తంతో ఏర్పాటు చేసేదీ త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ కేంద్రంలో ఫ్యాన్లతోపాటు ఇతర ఎలక్ట్రిక్‌ ఉపకరణాలను ఉత్పత్తి చేస్తామన్నారు. కాగా, ఎలిగంజా సిరీస్‌లో ఫ్యాన్‌తో కూడిన షాండెలియర్స్‌ను ఆవిష్కరించారు. ధరల శ్రేణి రూ.17,500–23,500 మధ్య ఉంది. ప్రీమియం ఫ్యాన్ల విపణిలో ఓరియంట్‌కు 50 శాతం మార్కెట్‌ వాటా ఉందని కంపెనీ బ్రాండ్‌ హెడ్‌ అన్షుమన్‌ చక్రవర్తి తెలిపారు. ఓరియంట్‌ ఎలక్ట్రిక్‌ 2018–19లో సుమారు రూ.2,000 కోట్ల టర్నోవర్‌ సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో 20 శాతం వృద్ధి నమోదు చేసింది. 

మరిన్ని వార్తలు