రుణాలకు ఆక్సీలోన్స్

17 Nov, 2016 01:13 IST|Sakshi
రుణాలకు ఆక్సీలోన్స్

రుణదాత, గ్రహీత  ఇద్దరినీ కలిపే వేదిక
ఆక్సీలోన్‌‌స ఫౌండర్, సీఈఓ రాధాకృష్ణ

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటివరకు రుణాల కోసం బ్యాంకులకో, ఆర్థిక సంస్థలకో, లేక వడ్డీ వ్యాపారుల వద్దకో పరుగెత్తాం. కానీ, ఇప్పుడా అవసరం లేదంటోంది ఆక్సీలోన్‌‌స. రుణదాతలు, గ్రహీతలు ఇద్దరినీ కలపడమే మా పనంటోంది కూడా. హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన ఆక్సీలోన్‌‌స స్టార్టప్ సేవలు, విశేషాల గురించి సంస్థ ఫౌండర్, సీఈఓ రాధాకృష్ణ తాటవర్తి మాటల్లోనే..

సాంకేతికత, విద్యా, వ్యాపార రుణాలు మాత్రమే కాకుండా గర్భవతి రుణాలు, గోల్ఫ్ మెంబర్‌షిప్ రుణాలు, ఇస్లామిక్ రుణాల వంటివి కూడా ఇప్పించడం మా ప్రత్యేకత. ప్రస్తుతం 20 రకాల రుణాలను ఇప్పిస్తున్నాం. గోల్ఫ్ కోర్ట్‌లతో, విద్యా సంస్థలతోనూ ఒప్పందం చేసుకున్నాం.

మొత్తం రుణ మంజూరులో గ్రహీత నుంచి 1.5 శాతం, దాత నుంచి 2.5 శాతం కమీషన్ రూపంలో తీసుకుంటాం.  ప్రస్తుతం మన దేశంతో పాటు దుబాయ్, కతర్ వంటి జీసీసీ దేశాలు, యూకేల్లో సేవలందిస్తున్నాం.

సాంకేతికత అభివృద్ధి, ఉద్యోగుల నియామకం, ప్రచారం కోసం కోటి రూపాయలు ఖర్చరుుంది. వచ్చే నెలలో సీడ్ క్యాపిటల్ కింద రూ.3 కోట్ల ని దుల సమీకరణ చేయనున్నాం. వచ్చే ఏడాది ఆగ స్టు నాటికి రూ.20 మిలియన్ డాలర్ల వెంచర్ క్యాపటలిస్ట్ నిధులను కూడా పొందాలని లక్ష్యించాం.

మరిన్ని వార్తలు