చేతులు మారిన విశాల్‌ మెగా మార్ట్‌

22 May, 2018 01:01 IST|Sakshi

డీల్‌ విలువ రూ.5,000 కోట్లు !

న్యూఢిల్లీ: వ్యాల్యూ రిటైల్‌ చెయిన్‌ విశాల్‌ మెగా మార్ట్‌(వీఎమ్‌ఎమ్‌) చేతులు మారుతోంది. విశాల్‌ మెగా మార్ట్‌ను ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు పార్ట్‌నర్స్‌ గ్రూప్, కేదార క్యాపిటల్‌ ఫండ్‌లు కొనుగోలు చేయనున్నాయి. ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ, టీపీజీ నుంచి విశాల్‌ మెగా మార్ట్‌ను ఈ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి.

విశాల్‌ మెగామార్ట్‌ కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడి కాలేదు. అయితే ఈ డీల్‌ సైజు రూ.5,000 కోట్ల రేంజ్‌లో ఉండొచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 110 నగరాలు, పట్టణాల్లో విశాల్‌ మెగా మార్ట్‌ మొత్తం 229 స్టోర్స్‌ను నిర్వహిస్తోంది.  

మరింత వృద్ధి..
తర్వాతి స్థాయి వృద్ది కోసం తమకు సరైన భాగస్వాములు లభించారని వీఎమ్‌ఎమ్‌ ఎమ్‌డీ, సీఈఓ గునేందర్‌ కపూర్‌ చెప్పారు. పార్ట్‌నర్స్‌ గ్రూప్, కేదార క్యాపిటల్‌ ఫండ్‌ల తోడ్పాటుతో మరింత వృద్ధిని సాధిస్తామని పేర్కొన్నారు. కాగా విశాల్‌ మెగామార్ట్‌ కొనుగోలుకు వివిధ ప్రభుత్వ సంస్థల ఆమోదాలు పొందాల్సి ఉందని, ఈ ఏడాది చివరకు డీల్‌ పూర్తవ్వగలదని పార్ట్‌నర్స్‌ గ్రూప్‌ పేర్కొంది. 

మరిన్ని వార్తలు