ఆర్‌కామ్‌ యూజర్లకు బ్యాడ్‌న్యూస్‌

4 Nov, 2017 11:30 IST|Sakshi

న్యూఢిల్లీ : నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న టెలికాం ఆపరేటర్‌ రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ తన వాయిస్‌ కాల్‌ సర్వీసులను మూసివేస్తోంది. డిసెంబర్‌ 1 నుంచి తమ ఈ సర్వీసులను క్లోజ్‌ చేస్తున్నట్టు ఆర్‌కామ్‌ పేర్కొంది. తమ కస్టమర్లను ఈ ఏడాది చివరి నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు తరలించనున్నట్టు కూడా వెల్లడించింది. టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్‌ ఆదేశాల మేరకు ఆర్‌కామ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ లిమిటెడ్‌ కేవలం 4జీ డేటా సర్వీసులను మాత్రమే తన కస్టమర్లు అందించనుందని, తన సబ్‌స్క్రైబర్లకు ప్రస్తుతం అందిస్తున్న వాయిస్‌ సర్వీసులను 2017 డిసెంబర్‌ 1 నుంచి మూసివేస్తున్నట్టు ట్రాయ్‌ అన్ని టెలికాం ఆపరేటర్లకు చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌, హర్యానా, మహారాష్ట్ర, యూపీ ఈస్ట్‌, వెస్ట్‌, తమిళనాడు, కర్నాటక, కేరళ వంటి ఎనిమిది టెలికాం సర్కిళ్లలో 2జీ, 4జీ సర్వీసులను అందించనున్నట్టు ఆర్‌కామ్‌, ట్రాయ్‌కు తెలిపింది. 

సిస్టెమా శ్యామ్‌ టెలిసర్వీసెస్‌లో విలీనమైన తర్వాత సీడీఎంఏ నెట్‌వర్క్‌ను అప్‌గ్రేట్‌ చేస్తామని, ఢిల్లీ, రాజస్తాన్‌, యూపీ వెస్ట్‌, తమిళనాడు, కేరళ, కర్నాటక, పశ్చిమ బెంగాల్‌, గుజరాత్‌, కోల్‌కత్తాలకు 4జీ సర్వీసులను అందించనున్నట్టు అనిల్‌ అంబానీకి చెందిన ఈ సంస్థ తెలిపింది.  అయితే సబ్‌స్క్రైబర్లు పెట్టుకునే ఎలాంటి పోర్టింగ్‌ అభ్యర్థనను కూడా సంస్థ నిరాకరించరాదని రెగ్యులేటరీ, ఆర్‌కామ్‌ను ఆదేశించింది. వాయిస్‌ సర్వీసులను మూసివేయాలని నిర్ణయించిన ఈ సంస్థ రూ.46వేల కోట్ల రుణాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఎయిర్‌సెల్‌ విలీన ఒప్పందం బెడసికొట్టడంతో, తన వైర్‌లెస్‌ సర్వీసులను మూసివేసేందుకు సిద్ధమైంది.  

మరిన్ని వార్తలు