డాలర్‌ బలంతో రూపాయి డీలా..!

20 Mar, 2018 01:06 IST|Sakshi

ఒకేరోజు 23 పైసలు డౌన్‌

65.17 వద్ద ముగింపు 

ముంబై: అంతర్జాతీయంగా పటిష్ట డాలర్‌ ఇండెక్స్, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక సమావేశం నేపథ్యంలో సోమవారం రూపాయి నష్టాల బాట పటింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 23 పైసలు తగ్గి 65.17 వద్ద ముగిసింది.

భారత్‌ కరెంట్‌ అకౌంట్‌ (క్యాడ్‌– ఎఫ్‌ఐఐ, డీఐఐ, ఈసీబీలు మినహా దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం) పెరుగుతుందన్న ఆందోళనలు కూడా రూపాయి బలహీనతకు కారణమని విశ్లేషకుల అంచనా. డిసెంబర్‌ త్రైమాసికంలో జీడీపీలో క్యాడ్‌ 2 శాతంగా నమోదయ్యిందని తాజా గణాంకాలు స్పష్టం చేశాయి.

మరిన్ని వార్తలు