సాక్షి మనీ మంత్ర: వరుస నష్టాల తర్వాత లాభాల్లో దేశీయ మార్కెట్లు

27 Oct, 2023 16:16 IST|Sakshi

వరుస నష్టాల తర్వాత దేశీయ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 634 పాయింట్లు లాభపడి 63782 వద్దకు చేరింది. నిఫ్టీ 190 పాయింట్లు ర్యాలీ అయి 19047 వద్ద స్థిరపడింది. యూఎస్‌ డాలర్‌తో పోలిస్తే రూపాయి మరకపు విలువ రూ.83.234కు చేరింది.
 
సెన్సెక్స్‌ 30లోని యాక్సిక్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్‌, నెస్లే, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎల్‌ అండ్‌ టీ, ఇన్ఫోసిస్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, విప్రో, భారతీ ఎయిర్‌టెల్‌ భారీగా లాభపడ్డాయి. ఆల్ట్రాటెక్‌ సెమెంట్‌, ఐటీసీలు స్పల్ప నష్టాలతో ట్రేడయ్యాయి. 

దేశీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటంతో భారత రూపాయి శుక్రవారం స్వల్పంగా 2 పైసలు పెరిగింది. డాలర్ బలపడడం, ముడి చమురు ధరలు పెరగడం వంటివి రూపాయిపై స్వల్ప ప్రతికూల ప్రభావాన్ని కలిగించాయి. విదేశీ సంస్థగత పెట్టుబడుల తరలింపు, మిడిల్‌ ఈస్ట్‌ దేశాల్లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం కూడా రూపాయిపై ఒత్తిడిని కలిగించాయి. సిరియాలో యూఎస్‌ మిలిటరీ, ఇరాన్‌లమధ్య అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో రానున్నరోజుల్లో రూపాయి కొంత దిగువ స్థాయుల్లోకి వెళ్లనుందనే అంచనాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు